Roshan Kanakala: హీరోగా యాంకర్ సుమక్క కొడుకు.. లుక్ అదిరింది

ABN , First Publish Date - 2023-03-15T22:33:03+05:30 IST

చాలా రోజులుగా యాంకర్ సుమ (Anchor Suma), నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కుమారుడు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా పరిచయం అవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ..

Roshan Kanakala: హీరోగా యాంకర్ సుమక్క కొడుకు.. లుక్ అదిరింది
Roshan Kanakala

చాలా రోజులుగా యాంకర్ సుమ (Anchor Suma), నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కుమారుడు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా పరిచయం అవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ.. సరైన అప్‌డేట్ మాత్రం రాలేదు. యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడనేలా వార్తలు బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఎప్పుడెప్పుడు రోషన్‌ని అరంగేట్రం చేయిద్దామా? అని ఎదురు చూస్తున్న సుమ, రాజీవ్‌లు బుధవారం డైరెక్ట్‌గా సినిమానే అనౌన్స్ చేసేశారు. అంతేకాదు.. డెబ్యూ హీరో లుక్‌ని కూడా విడుదల చేశారు. ఈ లుక్ చూసిన వారంతా.. సుమక్క కొడుకు చాలా బాగున్నాడంటూ కామెంట్స్ చేస్తూ.. రోషన్ పిక్‌ని వైరల్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. ‘క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల’ (Kshanam and Krishna & His Leela) వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు రవికాంత్ పేరేపు (Ravikanth Parepu) దర్శకత్వంలో రోషన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1‌గా (Maheshwari Movies Production No.1) తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పి విమల (P Vimala) నిర్మిస్తున్నారు. రోషన్ కనకాల పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం డిజెగా వైబ్రెంట్ అవతార్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో రోషన్ గిరజాల జుట్టు, సన్ గ్లాసెస్‌తో, DJ సిస్టమ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తూ హెడ్‌సెట్ ధరించి కనిపించారు. ఈ పోస్టర్ చాలా ట్రెండీగా ఉంది. అందుకే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. (Roshan Kanakala Look)

Roshan-.jpg

ఇంకా పేరు పెట్టని ఈ సినిమా న్యూ ఏజ్ రోమ్-కామ్‌గా రూపొందనుందని.. రవికాంత్ పేరేపు‌తో పాటు విష్ణు కొండూరు, సెరి-గన్ని ఈ చిత్రానికి రచయితలు వ్యవహరించనున్నారని మేకర్స్ తెలిపారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం, నవీన్ యాదవ్ (Naveen Yadav) కెమెరా బాధ్యతలను నిర్వహిస్తున్నట్లుగా చెబుతూ.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వారు తెలియజేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..

*PVT04: మెగా హీరోని ఢీ కొట్టబోతోంది ఎవరో తెలుసా?

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-15T22:34:44+05:30 IST