Hit2 Max: మాక్స్‌కు.. ‘హిట్2’ యూనిట్ కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2023-07-14T19:22:54+05:30 IST

‘హిట్ 2’లో అడివి శేష్ హీరోగా నటించగా.. అందులో ఓ డాగ్ కీలక పాత్రని పోషించింది. సినిమాలో ఆ డాగ్ పేరు మాక్స్. ఇప్పుడా మాక్స్ ఇక బ్రతికి లేదు. తీవ్ర జ్వరంలో చనిపోయినట్లుగా తాజాగా అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. కన్నీటి పర్యంతమయ్యారు.

Hit2 Max: మాక్స్‌కు.. ‘హిట్2’ యూనిట్ కన్నీటి వీడ్కోలు
Adivi Sesh and Sailesh Kolanu with Max

శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్’ (Hit) పేరుతో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. త్వరలో మూడో సినిమా కూడా రానుందనేలా.. రెండో సినిమా ఎండింగ్‌లో హింట్ ఇచ్చారు. అయితే ‘హిట్ 2’ (Hit2)లో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించగా.. అందులో ఓ డాగ్ కీలక పాత్రని పోషించింది. సినిమాలో ఆ డాగ్ పేరు మాక్స్ (Max). ఇప్పుడా మాక్స్ ఇక బ్రతికి లేదు. తీవ్ర జ్వరంలో చనిపోయినట్లుగా తాజాగా అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. కన్నీటి పర్యంతమయ్యారు. అడివి శేష్ మాత్రమే కాదు.. దర్శకుడు శైలేష్ కొలను కూడా మాక్స్ గురించి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.


సినిమాలో మాక్స్ నటించిన డాగ్ బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్‌కు చెందినది. దాని అసలు పేరు సాషా. ఇప్పుడు సాషా మరణవార్త హిట్2 చిత్రబృందాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సినిమాలో నటించిన వారు సాషాతో తమకున్న అనుభవాన్ని షేర్ చేస్తూ.. నివాళులు అర్పిస్తున్నారు. ‘‘టిక్ జ్వరం ఎక్కువగా రావడంతో.. సాషా మరణించింది. ఈ విషయం చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. సాషా హిట్ 2 సినిమాలో మాక్స్ పాత్రను పోషించింది. జ్వరాన్ని గమనించి హాస్పిటల్‌కి తీసుకెళ్లాం.. మాక్స్ కోలుకుంటుందని ఎంతగానో ఆశించాం. కానీ మాక్స్ మా అందరినీ విడిచి వెళ్ళిపోయింది. సాషా శిక్షకుడు ఆనంద్‌కు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ అని అడివి శేష్ (Adivi Sesh about Max) తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Adivi-Sesh.jpg

దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) తన ట్వీట్‌లో బాధాతృప్త హృదయంతో ఈ వార్తను తెలియజేస్తున్నాను. మాకెంతో ఇష్టమైన మాక్స్ ఇక లేదని తెలిసి చాలా బాధగా ఉంది. ఆమె గత పది రోజులుగా తీవ్రమైన టిక్ ఫీవర్‌తో బాధపడుతూ.. నిజంగానే పోరాడింది. నా జీవితంలో నేను కలుసుకున్న గొప్పవాటిలో మాక్స్ కూడా ఒకటి. ఆఫీసర్ మాక్స్, మిమ్మల్ని మిస్ అవుతున్నాం. మీరు లేకుండా హిట్2 సినిమా అలా అయితే ఉండేది కాదని చెప్పుకొచ్చారు. ఓ కీలక పాత్రలో నటించిన కోమలి ప్రసాద్ (Komalee Prasad) కూడా మాక్స్ మృతికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం ‘హిట్ 2’ చిత్రయూనిట్ చేసిన ఈ ట్వీట్స్‌తో నెటిజన్లు కూడా మాక్స్‌కు నివాళులు అర్పిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*AR Rahman: నేను రామ్‍చరణ్ RC16కు పని చేస్తున్నా..

**************************************

*MS Dhoni: నా భార్య సినిమా అన్నప్పుడు.. నేను త‌న‌తో ఒకే మాట చెప్పా..

**************************************

*Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?

**************************************

*Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి

**************************************

*Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..

**************************************

Updated Date - 2023-07-14T19:22:54+05:30 IST