Mechanic: పిల్లే కాదు.. సిద్ శ్రీరామ్ పాడిన పాట కూడా జనాలకి బాగా నచ్చేసింది.. అందుకే ఎక్కేసింది

ABN , First Publish Date - 2023-10-06T18:50:30+05:30 IST

టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మణి సాయి తేజ, రేఖ నిరోషా హీరోహీరోయిన్లుగా నాగ మునెయ్య(మున్నా) నిర్మాతగా ముని సహేకర రచన-దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ‘నచ్చేసావే పిల్లా నచ్చేసావే’ లిరికల్ సాంగ్‌ని విడుదల చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంటోంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు.

Mechanic: పిల్లే కాదు.. సిద్ శ్రీరామ్ పాడిన పాట కూడా జనాలకి బాగా నచ్చేసింది.. అందుకే ఎక్కేసింది
Mechanic Movie Still

టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మణి సాయి తేజ (Mani Sai Teja), రేఖ నిరోషా (Rekha Nirosha) హీరోహీరోయిన్లుగా నాగ మునెయ్య(మున్నా) నిర్మాతగా ముని సహేకర (Muni Sahekara) రచన-దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం షూటింగ్ మరియు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్‌కి సిద్ధమైంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల సిద్ శ్రీరామ్ పాడిన ‘నచ్చేసావే పిల్లా నచ్చేసావే’ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఇప్పటి వరకు ఈ పాట యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టుకుని టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Nachesave Pilla Nachesave Song Response)


Mechanic-Movie.jpg

ఈ పాటకు వస్తోన్న స్పందన చూసిన చిత్ర నిర్మాత నాగ మునెయ్య (M. Naga Muneiah) మాట్లాడుతూ.. వినోద్ యాజమాన్య అందించిన సంగీతం మా చిత్రానికి హైలైట్. ఇటీవలే సిద్ శ్రీరామ్ పాడిన పాట ‘నచ్చేసావే పిల్లా నచ్చేసావే’ విడుదల చేశాం. యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా వ్యూస్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతకు ముందు విడుదల అయిన ‘టూలెట్ బోర్డు ఉంది నీ ఇంటికి’ అనే పాటని 16 లక్షల మంది యూట్యూబ్‌లో వీక్షించారు. మా ‘మెకానిక్’ చిత్రం విడుదల కాకముందే మంచి మ్యూజికల్ హిట్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో  విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో సెన్సార్ పనులు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Siddharth: తలైవా ఫోన్‌ చేశారు.. చెన్నై వచ్చాక ‘చిత్తా’ చూస్తానన్నారు

*********************************

*Prema Vimanam Trailer: వేసుకోవడానికి చెడ్డీ లేదు కానీ.. విమానంలో పోతారంట..

********************************

*Unstoppable with NBK Season 3: మరో దరువుకి సిద్ధమైన బాలయ్య.. ఎప్పటి నుంచి అంటే..

**********************************

*Allu Arjun: ‘మేడమ్ టుస్సాడ్స్’లో మైనపు విగ్రహాం.. తొలి తెలుగు నటుడిగా రికార్డ్.. అదెలా?

********************************

*Gopichand32: గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ మొదలైంది.. భారీగానే ప్లాన్ చేశారు

*********************************

Updated Date - 2023-10-06T18:50:30+05:30 IST