Honey Rose: బోల్డ్‌ పాత్రలో.. ఇదే ఫస్ట్ టైమ్

ABN , First Publish Date - 2023-07-24T13:19:14+05:30 IST

కోలీవుడ్‌లోని మహిళా దర్శకులపట్ల హీరోయిన్‌ హనీ రోజ్‌ జాలిపడుతున్నారు. వారు చిత్ర నిర్మాణ రంగంలో రాణించాలంటే పోరాటమే చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె అభిప్రాయపడ్డారు. హీరో జీవా నటించిన ‘సింగంపులి’ చిత్రంతో కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన ఆమె.. ప్రస్తుతం ‘రేచల్‌’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సందర్భంగా ఆమె చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది.

Honey Rose: బోల్డ్‌ పాత్రలో.. ఇదే ఫస్ట్ టైమ్
Actress Honey Rose

కోలీవుడ్‌లోని మహిళా దర్శకులపట్ల హీరోయిన్‌ హనీ రోజ్‌ (Honey Rose) జాలిపడుతున్నారు. వారు చిత్ర నిర్మాణ రంగంలో రాణించాలంటే పోరాటమే చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె అభిప్రాయపడ్డారు. హీరో జీవా నటించిన ‘సింగంపులి’ చిత్రంతో కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన ఆమె.. తాజాగా పాన్‌ ఇండియా మూవీగా రూపుదిద్దుకున్న ‘రేచల్‌’ (Rachel) చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రీసెంట్‌గానే ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో ఆమె ఒక కసాయి దుకాణంలో కూర్చొని కత్తితో మాంసాన్ని ముక్కలు చేస్తున్నారు. ఈ పోస్టర్‌ చర్చనీయాంశంగా మారింది.


ఈ సినిమాపై హనీ రోజ్‌ మాట్లాడుతూ... ‘‘ఇందులో నా పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది. ఈ తరహా చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. పైగా ఇందులో ఒక మహిళా దర్శకురాలైన ఆనందిని బాల (Anandhini Bala)తో కలిసి పనిచేశా. ఆమెకు కూడా ఇది మొదటి చిత్రమే. గతంలో ఇద్దరు మహిళలు నా వద్దకు వచ్చి స్టోరీలు వినిపించారు. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. కొందరు మహిళలకు అవకాశాలు అందిపుచ్చుకోవడం, వాటిని దక్కించుకోడం ఒక పోరాటంగా మారింది’’ అని అన్నారు. (Honey Rose about Lady Directors)

Honey-Rose-1.jpg

ప్రస్తుతం అన్ని భాషలలో హనీ రోజ్ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌ (Tollywood)లో ఆమె నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) మంచి విజయం సాధించడంతో.. కొందరు దర్శకనిర్మాతలు ఆమెకు మంచి పాత్రలు ఇచ్చేందుకు క్యూ కడుతున్నారు. త్వరలోనే టాలీవుడ్‌లో ఆమె బిజీ నటిగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో హనీ రోజ్ సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫొటో పెట్టి.. కావాల్సిన వారికి (ఫ్యాన్స్) బాగానే టచ్‌లో ఉంటుందీమ్మడు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Ruhani Sharma: నేనా టైప్ కాదు.. కానీ అది ముఖ్యం

**************************************

*Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది

**************************************

*Amala Paul: మళ్లీ స్పాట్‌లైట్‌లోకి అమల.. ఫొటోస్‌‌తో మతి పోగొట్టేసిందిగా!

**************************************

*SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?

**************************************

*Unstoppable: ఓటీటీలోకి వచ్చేసిన ‘అన్‌స్టాపబుల్’.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..

**************************************

Updated Date - 2023-07-24T13:21:56+05:30 IST