Bro: ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లే వారంతా.. ఈ విషయం తెలుసుకోండి

ABN , First Publish Date - 2023-07-25T16:57:02+05:30 IST

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం జరగాల్సి ఉండగా.. హైదరాబాద్‌లోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాస్త ఆలస్యంగా ఈ వేడుక జరుగుతుందని చిత్రయూనిట్ తెలియజేసింది.

Bro: ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లే వారంతా.. ఈ విషయం తెలుసుకోండి
Bro Movie Posters

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’ (Bro). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinvias) స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జూలై 28న భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను (Bro Pre Release Event) నేడు (మంగళవారం) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతోంది. అయితే ఈ వేడుకకు వచ్చే అభిమానులందరికీ ఓ విన్నపం అంటూ.. తాజాగా చిత్రయూనిట్ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. అందులో ఏముందంటే..


Bro-1.jpg

‘‘నేటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా, గౌరవ పోలీసు శాఖ వారి సూచనల మేరకు అనుకున్న సమయానికన్నా ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుక కొంత ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. విచ్చేసే అభిమాన ప్రేక్షకులు దీనిని దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు పడకుండా టీవీలలో ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వేడుకను వీక్షించగలరని మనవి’’ (Attention Devotees) అని తెలియజేశారు. ఈ వేడుక రాత్రి 8గంటల 30నిమిషాలకు మొదలవుతుందని ఓ ప్రకటనను విడుదల చేశారు.

Bro-2.jpg

వాస్తవానికి ఓ వారం రోజులుగా హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురుస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత అంతా బయటికి రావడంతో.. మరీ ముఖ్యంగా రాత్రిపూట ట్రాఫిక్ జామ్స్ బాగా అవుతున్నాయి. అందుకే అభిమానులని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే.. యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) ఇందులో టైమ్‌గా నటిస్తుండగా.. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మార్కండేయులు (మార్క్)గా కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, అందులో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు, అలాగే రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కూడా మంచి స్పందనను రాబట్టుకోవడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మరి ఈ అంచనాలను జూలై 28న విడుదలయ్యే ఈ సినిమా ఎలా రీచ్ అవుతుందో చూడాలి.


ఇవి కూడా చదవండి:

**************************************

*Sara Arjun: సారా అర్జున్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న దర్శకుడెవరో తెలుసా?

**************************************

*Prathinidhi 2: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫిల్మ్ డిటైల్స్.. వచ్చేశాయ్

**************************************

*Samuthirakani: సమయం వృధా చేయకూడదని సెట్‌లోనే పవర్ స్టార్ అలా చేశారు

**************************************

*Honey Rose: బోల్డ్‌ పాత్రలో.. ఇదే ఫస్ట్ టైమ్

**************************************

*Ruhani Sharma: నేనా టైప్ కాదు.. కానీ అది ముఖ్యం

**************************************

*Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది

**************************************

Updated Date - 2023-07-25T16:59:11+05:30 IST