Prathinidhi 2: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫిల్మ్ డిటైల్స్.. వచ్చేశాయ్

ABN , First Publish Date - 2023-07-24T20:41:12+05:30 IST

హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ అంటూ.. ఓ ప్రీ లుక్ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రీ లుక్‌కి సంబంధించిన ఫుల్ డిటైల్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాకు ‘ప్రతినిధి 2’ అని తెలుపుతూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.

Prathinidhi 2: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫిల్మ్ డిటైల్స్.. వచ్చేశాయ్
Prathinidhi 2 First Look

హీరో నారా రోహిత్ (Nara Rohit) కమ్ బ్యాక్ మూవీ అంటూ.. ఓ ప్రీ లుక్ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రీ లుక్‌కి సంబంధించిన ఫుల్ డిటైల్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి ఒక్కసారిగా సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు. విషయంలోకి వస్తే.. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు (Murthy Devagupthapu) దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో ఇది ‘ప్రతినిధి’ (Prathinidhi) సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


అప్పట్లో వచ్చిన ‘ప్రతినిధి’ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్‌గా సంచలన విజయం సాధించింది. యూనిక్ కథ, గ్రిప్పింగ్ కథనంతో అందరి ప్రశంసలు అందుకుంది. ‘ప్రతినిధి 2’ కోసం మరింత బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నట్లుగా విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తోంది. “One man will stand again, against all odds” అనేది ఈ సినిమా క్యాప్షన్. (Prathinidhi 2 First Look)

Nara-Rohit-Movie.jpg

ఇక ఈ ఫస్ట్-లుక్ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్‌తో ఆకట్టుకుంటోంది. నారా రోహిత్ చేయి పైకెత్తి కనిపిస్తున్నారు. అతని జుట్టు నుంచి ముఖం వరకు, ప్రతిదీ వార్తాపత్రికలతో డిజైన్ చేయబడింది. ఫస్ట్ లుక్ సూచించినట్లుగా, ‘ప్రతినిధి 2’ సోషల్ ఇష్యూస్‌ని డీల్ చేయనుందనేది అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతూ.. నారా రోహిత్‌ది ఇది సరైన కమ్ బ్యాక్ ఫిల్మ్ అనేలా టాక్‌ని సొంతం చేసుకుంటోంది. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా పోస్టర్‌తో తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Samuthirakani: సమయం వృధా చేయకూడదని సెట్‌లోనే పవర్ స్టార్ అలా చేశారు

**************************************

*Honey Rose: బోల్డ్‌ పాత్రలో.. ఇదే ఫస్ట్ టైమ్

**************************************

*Ruhani Sharma: నేనా టైప్ కాదు.. కానీ అది ముఖ్యం

**************************************

*Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది

**************************************

*Amala Paul: మళ్లీ స్పాట్‌లైట్‌లోకి అమల.. ఫొటోస్‌‌తో మతి పోగొట్టేసిందిగా!

**************************************

*SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?

**************************************

Updated Date - 2023-07-24T20:41:12+05:30 IST