Sara Arjun: సారా అర్జున్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న దర్శకుడెవరో తెలుసా?

ABN , First Publish Date - 2023-07-25T16:08:26+05:30 IST

మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’లో యుక్తవయసు నందిని (ఐశ్వర్యరాయ్‌)గా నటించిన యువ నటి సారా.. ఇక హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఆమెను కోలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న దర్శకుడు మరెవరో కాదు.. ఆమెను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు విజయ్.. ఇప్పుడు హీరోయిన్‌గానూ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు.

Sara Arjun: సారా అర్జున్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న దర్శకుడెవరో తెలుసా?
Sara Arjun

మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ (Ponniyin Selvan 2)లో యుక్తవయసు నందిని(ఐశ్వర్యరాయ్‌)గా నటించిన యువ నటి సారా (Sara Arjun).. ఇక హీరోయిన్‌గా కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు ఏఎల్‌. విజయ్‌ (AL Vijay) ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. 2011లో విజయ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దైవ తిరుమగళ్‌’ (Deiva Thirumagal)లో హీరో విక్రమ్‌ (Vikram) కుమార్తెగా నిలా అనే పాత్రలో సారా నటించారు. ఆ తర్వాత ‘శైవం’ (Saivam)లో కూడా ఆమె నటించారు. గత ఏడాది మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’లో యుక్త వయసు నందినిగా నటించి, ప్రతి ఒక్కరి మన్నలను అందుకున్నారు.


అదే సమయంలో ఈమె సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. దీంతో సారా హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఇపుడు ఈ ప్రచారం నిజం కానుంది. సారాను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు విజయ్‌.. ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారు. 2025లో తాను చేపట్టే ప్రాజెక్టులో సారా హీరోయిన్‌గా నటిస్తారని తెలిపారు. సారాను బాలనటిగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడే ఇపుడు ఆమెను కథానాయికగా పరిచయం చేయనుండటం విశేషమనే చెప్పుకోవాలి.

Sara.jpg

‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’లో సారా పాత్ర విషయానికి వస్తే.. టీనేజ్ నందినిగా సారా ఇందులో నటించింది. నిజంగా ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) టీనేజ్‌లో ఉన్నప్పుడు ఇలానే ఉండేదేమో అనేలా.. ఆ పాత్రకు సారా కరెక్ట్‌గా సింక్ అయ్యింది. చిన్న పాత్రే అయినా.. తన నటనతో సారా ఆకట్టుకుంది. ఇప్పుడు హీరోయిన్‌గా అంటే.. కోలీవుడ్‌ (Kollywood)ని ఆమె ఊపేయడం ఖాయం.. అనేలా కోలీవుడ్ మీడియాలో అప్పుడే వార్తలు కూడా మొదలైపోయాయి. చూద్దాం.. ఆమెని విజయ్ ఎలా ప్రజంట్ చేయబోతున్నాడో..


ఇవి కూడా చదవండి:

**************************************

*Prathinidhi 2: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫిల్మ్ డిటైల్స్.. వచ్చేశాయ్

**************************************

*Samuthirakani: సమయం వృధా చేయకూడదని సెట్‌లోనే పవర్ స్టార్ అలా చేశారు

**************************************

*Honey Rose: బోల్డ్‌ పాత్రలో.. ఇదే ఫస్ట్ టైమ్

**************************************

*Ruhani Sharma: నేనా టైప్ కాదు.. కానీ అది ముఖ్యం

**************************************

*Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది

**************************************

*Amala Paul: మళ్లీ స్పాట్‌లైట్‌లోకి అమల.. ఫొటోస్‌‌తో మతి పోగొట్టేసిందిగా!

**************************************

Updated Date - 2023-07-25T16:08:26+05:30 IST