RRR: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన రాజమౌళి అండ్ టీమ్.. జైహింద్ అంటూ..

ABN , First Publish Date - 2023-03-17T10:35:27+05:30 IST

అందరూ అనుకున్నట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీలోని ‘నాటు నాటు’కి ఆస్కార్స్ (Oscars) దక్కింది.

RRR: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన రాజమౌళి అండ్ టీమ్.. జైహింద్ అంటూ..
RRR

అందరూ అనుకున్నట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీలోని ‘నాటు నాటు’కి ఆస్కార్స్ (Oscars) దక్కింది. 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న మొదటి ఏసియన్ పాటగా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ మూవీ టీంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఓ తెలుగు పాటకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడానికి ప్రధాన కారణం ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) విజనే అంటూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. (Oscars95)

RRR1.jpg

అయితే.. ఆస్కార్ వేదికపై ప్రపంచవ్యాప్త సినీ ప్రముఖుల సమక్షంలో కీరవాణి, చంద్రబోస్ అకాడమీ అవార్డును అందుకున్నారు. అనంతరం అమెరికాలోనే చిత్రబృందానికి జక్కన్న పార్టీ ఇవ్వడం తెలిసిందే. అయితే.. ఆ పార్టీ కంటే ముందే ఎన్టీఆర్ ఇండియాకి తిరిగి రాగా.. అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో మిగిలిన టీం ఎప్పుడు వస్తుందా అని అభిమానులతో పాటు మీడియా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ‘ఆర్ఆర్ఆర్’ టీం విజయోత్సహంతో నగరానికి చేరుకుంది. (RRR team return to Hyderabad)

RRR2.jpg

నేడు (శుక్రవారం) తెల్లవారుజామున మూడు గంటలకి రాజమౌళి, ఆయన భార్య రమా, కీరవాణి, ఆయన భార్య వల్లి, కార్తీకేయ, కాలభైరవ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. వారు వస్తున్న ముందే తెలిసిన పలువురు ఫ్యాన్స్ ఈ బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ తరుణంలో మీడియా రాజమౌళితో మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఆయన జైహింద్ అని నినాదం చేస్తూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. (RRR team return to Hyderabad)

ఇవి కూడా చదవండి:

Kabzaa Twitter Review: కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’?.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Updated Date - 2023-03-17T11:36:19+05:30 IST