Saindhav: గాయత్రిగా సారా.. లుక్ విడుదల

ABN , First Publish Date - 2023-07-17T17:15:16+05:30 IST

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్‌’కు సంబంధించి ఇప్పటి వరకు వెంకీ ఫెరోషియస్ షేడ్స్‌ని పరిచయం చేస్తూ.. మేకర్స్ పోస్టర్స్ విడుదల చేశారు. ఇప్పుడు అతని లోతైన భావోద్వేగాన్ని పరిచయం చేశారు. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అని రివీల్ చేశారు మేకర్స్. సారా ఇందులో గాయత్రి పాత్రలో నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.

Saindhav: గాయత్రిగా సారా.. లుక్ విడుదల
Saindhav Movie Still

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav)కు సంబంధించి ఇప్పటి వరకు వెంకీ ఫెరోషియస్ షేడ్స్‌ని పరిచయం చేస్తూ.. మేకర్స్ పోస్టర్స్ విడుదల చేశారు. ఇప్పుడు అతని లోతైన భావోద్వేగాన్ని పరిచయం చేశారు. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ (The Heart Of Saindhav) అని రివీల్ చేశారు మేకర్స్. పోస్టర్‌‌లో పాప వెంకటేష్‌ (Venkatesh)‌ను కౌగిలించుకోవడం చూడవచ్చు. ఈ పోస్టర్‌లో వెంకటేష్‌ గాయాలతో కనిపిస్తున్నారు. సినిమాలో సారా పాత్ర పేరు గాయత్రి (Gayathri).


‘HIT’ ఫ్రాంచైజ్‌తో వరుస విజయాలు అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌‌ (Niharika Entertainment)పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సైంధవ్ హై-ఆక్టేన్ యాక్షన్‌‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సారా పాత్ర హార్ట్ అఫ్ సైంధవ్ అని మేకర్స్ చెబుతున్నారు.

కాగా.. ఈ చిత్రంతో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ వికాస్ మాలిక్ పాత్రలో నటిస్తూ.. టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో కథానాయికగా నటిస్తుండగా, డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ స్పెషల్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Ketika Sharma: ‘బ్రో’ సినిమాకు ఆయన పేరు చాలు

**************************************

*Nidhhi Agerwal: పవర్‌స్టార్‌కి థ్యాంక్స్ చెప్పిన నిధి.. పోస్ట్ వైరల్

**************************************

*SSMB29: మహేష్ కుమార్తె, ఎన్టీఆర్ కుమారుడు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీటు!

**************************************

*Namrata Shirodkar: గౌతమ్ ఎంట్రీకి టైముంది.. సితార ఇంట్రెస్ట్‌గా ఉంది

**************************************

*Anasuya: మళ్లీ ఏమైంది అనసూయ.. ‘బేబీ’ మూవీ గురించేనా..!

**************************************

*Keerthi Suresh: మీ షర్టు వేసుకుంటానని హీరోని అడిగేశా..

**************************************

Updated Date - 2023-07-17T17:15:16+05:30 IST