BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..

ABN , First Publish Date - 2023-06-23T18:26:22+05:30 IST

బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BoyapatiRAPO ముగింపు దశకు చేరుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, అన్నీ పర్ఫెక్ట్‌గా జరగడంతో దాదాపు నెలరోజుల ముందే ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..
Ustaad Ram Pothineni In BoyapatiRAPO Film

మాస్ బీభత్సం మరింత ముందుకు వచ్చేసింది. ఎప్పుడో అక్టోబర్‌‌లో రావాల్సిన సినిమా దాదాపు నెల రోజుల ముందే వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజంగా ఇలాంటి అనౌన్స్‌మెంట్ ఈ మధ్యకాలంలో రాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. చెప్పిన తేదీకి సినిమాని విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు నానా తంటాలు పడుతున్నారు. అసలా టైమ్‌కి షూటింగ్ అవుతుందో లేదో తెలియకుండానే విడుదల తేదీ ప్రకటించడం, మళ్లీ వాయిదా వేయడం.. సర్వసాధారణంగా మారిపోయింది. అలాంటిది బోయపాటి (Boyapati), రామ్‌(Ram)ల సినిమాని పాన్ ఇండియా (Pan India) స్థాయిలో.. ఇంతకు ముందు చెప్పిన తేదీ కంటే నెల రోజులు ముందే థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు.. నిజంగా ఇది విశేషమే మరి. విషయంలోకి వస్తే..

బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu), ఉస్తాద్ రామ్ పోతినేని (Ustaad Ram Pothineni) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BoyapatiRAPO ముగింపు దశకు చేరుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, అన్నీ పర్ఫెక్ట్‌గా జరగడంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే ముందే ముగియడంతో పాటు.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతుండటంతో.. మేకర్స్ సెప్టెంబర్ 15కే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. (BoyapatiRAPO Release Date)

Ram.jpg

ఇక రిలీజ్ డేట్ తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో రామ్ వైట్ అండ్ వైట్‌‌లో సూపర్ చార్మింగ్‌గా కనిపిస్తున్నారు. తెల్లటి చొక్కా, లుంగీ ధరించి, పొలంలో కాఫీని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. ఈ చిత్రంలో రామ్ గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌లో ఉన్నారు. రామ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు బోయపాటి. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Sreeleela: దేవాలయం కంటే గొప్పది.. ఆ విషయం బాలయ్యకి కూడా తెలియదు.


**************************************

*Spy Trailer Talk: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదెవరు చెప్పారో తెలుసా?


**************************************

*Rashmika Mandanna: మేనేజర్‌తో విభేదాలనే వార్తలపై రష్మిక ఏమందంటే..


**************************************

*MAA: టాలీవుడ్, బాలీవుడ్ సరిహద్దులను చెరిపేస్తున్న ‘మా’


**************************************

Updated Date - 2023-06-23T18:26:22+05:30 IST