KP Chowdary: ‘కబాలి’ నిర్మాత కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2023-06-23T21:23:53+05:30 IST

తెలుగు సినీ పరిశ్రమలో మరోమారు డ్రగ్స్‌ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. టాలీవుడ్‌కి చెందిన అషు రెడ్డి పేరు ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది.

KP Chowdary: ‘కబాలి’ నిర్మాత కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
KP Chowdary and Ashu Reddy

తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)లో మరోమారు డ్రగ్స్‌ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. టాలీవుడ్‌కి చెందిన అషు రెడ్డి (Ashu Reddy) పేరు ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది. పలు బ్లాక్‌బస్టర్‌ తెలుగు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా, తెలుగులో ‘కబాలి’ (Kabali) డబ్బింగ్‌ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి (KP Chowdary) అలియాస్‌ సుంకరి కృష్ణప్రసాద్‌ చౌదరి డ్రగ్స్‌తో ఇటీవల పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. సినీ రంగంలో నష్టాలు రావడంతో.. కేపీ చౌదరి డ్రగ్స్‌ దందా మొదలు పెట్టినట్లుగా విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. గోవాలో డ్రగ్స్‌ సరఫరాదారుడు, నైజీరియా దేశస్థుడు ఇబుజర్‌ అలియాస్‌ గబ్రియల్‌ వద్ద 100 షీట్ల(111.45 గ్రాములు) కొకైన్‌ను కొని.. కారులో తీసుకు వస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ కోణం వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు.. కేపీ చౌదరి నుంచి సంచలన విషయాలను రాబట్టినట్లుగా తెలుస్తోంది.

కేపీ చౌదరి కాల్ లిస్ట్‌ని డీకోడ్ చేసిన పోలీసులు.. కేపీ చౌదరి-అషురెడ్డిల మధ్య వందల ఫోన్ కాల్స్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. అషురెడ్డి (Ashu Reddy) మాత్రమే కాకుండా.. ఐటంసాంగ్స్‌కి ఫేమస్ అయిన మరో నటి, అలాగే టాలీవుడ్‌కి చెందిన కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కొందరు రాజకీయ నేతల కుమారులు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ ఫోన్ కాల్స్‌పై విచారణ జరపగా.. కేపీ చౌదరి నోరు మెదపలేదని తెలుస్తోంది. విచారణలో 12 మందికి డ్రగ్స్ సప్లయ్ చేసినట్లుగా కేపీ చౌదరి అంగీకరించారని, అందులో బడా బాబుల పేర్లు, పలువురు యువతులు ఉన్నట్లుగా సమాచారం. కాల్ లిస్ట్ మాత్రమే కాకుండా.. కేపీ చౌదరి బ్యాంక్ లావాదేవీలను సైతం పరిశీలించిన పోలీసులకు.. ఆయన అకౌంట్స్‌లో భారీగా నగదు ట్రాన్సెక్షన్స్ జరిగినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.

ఇక ఈ విచారణలో ప్రముఖంగా వినిపిస్తున్న అషు రెడ్డి విషయానికి వస్తే.. ఆమె ఈ మధ్య ఏ విధంగా పాపులర్ అయిందో తెలియంది కాదు. జూనియర్ సమంత (Jr Samantha)గా పేరున్న అషు రెడ్డి.. బిగ్‌బాస్ తెలుగు (Bigg Boss Telugu)లో కంటెస్టెంట్‌గా.. ఆ తర్వాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో చేసిన కొన్ని వీడియోల ద్వారా మరింతగా ఫేమస్ అయింది. ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమెకు 2 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు సినిమా అవకాశాలు లేకపోయినా.. విదేశాలలో షికార్లు చేస్తూ లగ్జరీ లైఫ్‌ని కొనసాగిస్తుంటుంది. ఇప్పుడామె పేరు బయటికి రావడంతో.. ఆమె లగ్జరీ లైఫ్‌కి కారణం ఇదేనంటూ అప్పుడే కామెంట్స్ కూడా మొదలయ్యాయి.

కేపీ చౌదరి గురించి చెప్పుకుంటే.. రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన కబాలి(తమిళం) చిత్రాన్ని కేపీ చౌదరి నిర్మాతగా తెలుగులో డబ్‌ చేశారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, అర్జున్‌ సురవరం, సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు వంటి చిత్రాలకు కేపీ చౌదరి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. సినీ రంగంలో భారీ నష్టాలను చవిచూసి.. గోవాకు మకాం మార్చారు. అక్కడ ఓహెచ్‌ఎం అనే క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి గోవాలో వసతి కల్పించేవారు. క్లబ్‌ వ్యాపారంలోనూ నష్టాలు రావడంతో.. డ్రగ్స్‌ దందాకు తెరతీశారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..


**************************************

*Sreeleela: దేవాలయం కంటే గొప్పది.. ఆ విషయం బాలయ్యకి కూడా తెలియదు.


**************************************

*Spy Trailer Talk: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదెవరు చెప్పారో తెలుసా?


**************************************

*Rashmika Mandanna: మేనేజర్‌తో విభేదాలనే వార్తలపై రష్మిక ఏమందంటే..


**************************************

Updated Date - 2023-06-23T21:40:10+05:30 IST