సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

ABN, First Publish Date - 2023-03-25T13:07:44+05:30

రీసెంట్‌గా తనని బ్లాక్ చేశారంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)పై ‘వరుడు’ (Varudu) సినిమా హీరోయిన్ భానుశ్రీ మెహ్రా (Bhanushree Mehra).. ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ ట్వీట్ తర్వాత మళ్లీ

Bhanushree Mehra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రీసెంట్‌గా తనని బ్లాక్ చేశారంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)పై ‘వరుడు’ (Varudu) సినిమా హీరోయిన్ భానుశ్రీ మెహ్రా (Bhanushree Mehra).. ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ ట్వీట్ తర్వాత మళ్లీ అల్లు అర్జున్ తనని అన్‌బ్లాక్ చేశారంటూ మరో ట్వీట్‌లో ప్రకటించింది. అయితే పబ్లిక్‌గా భానుశ్రీ ఇలా కామెంట్స్ చేయడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. వారిని చల్లబరిచేందుకు మళ్లీ భానుశ్రీ ఓ ట్వీటేసిందనుకోండి. అదే వేరే విషయం. తాజాగా ఈ భామ ట్విట్టర్ వేదికగా మరో బాంబ్ పేల్చింది. ఈసారి అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయలేదు కానీ.. ఆయన వయసుకు సంబంధించిన హీరోలందరినీ టార్గెట్ చేసినట్లుగా ఈ ట్వీట్ ఉంది. (Heroine Bhanushree Mehra)

‘‘సినిమా పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య ఏమిటంటే వయసు (Age). ఒక వయసు వచ్చిన తర్వాత మహిళలను.. కేవలం తల్లి పాత్రలకే (Mother Roles) పరిమితం చేస్తున్నారు కానీ.. ఆ మహిళలతో నటించిన పురుషులకు వచ్చేసరికి అది వర్తించదు. వాళ్లు ఎప్పటిలాగానే ప్రధాన పాత్రల్లో.. తమకంటే వయసులో చిన్నవారైన హీరోయిన్లతో నటిస్తున్నారు. మహిళల యొక్క విలువను వయసు లేదా వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని ఎలా నిర్ణయిస్తారు? ఆ పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకండి. ధైర్యవంతులు, స్వతంత్రంగా ఉన్న మహిళల కథలను చెప్పండి. వయసు, ఆకారం, పరిమాణం అని చూడకుండా.. మహిళలందరినీ పరిశ్రమ ప్రోత్సహించాల్సిన సమయం ఇది. ఇది మీరూ అంగీకరిస్తారా?’’ అని భానుశ్రీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. అంతేకాదు 2012, 2023లోని తన లుక్‌కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. (Bhanushree Mehra Tweet on Age)

అయితే ఆమె ప్రశ్నలో అర్థముంది కానీ.. సమాధానం చెప్పడానికే ఎవరూ లేరు, రారు.. అనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రశ్నను కొందరు నెటిజన్లు అంగీకరిస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు (Bhanushree Mehra Controversial Tweet). ఇండస్ట్రీకి వయసు, ఆకారం వంటి వాటితో పని ఉండదు. మొన్నటి వరకు నెపోటిజం అని, ఇప్పుడేమో వయసు అని కూర్చోకుండా.. ఎప్పుడూ కష్టపడేవారికి ఖచ్చితంగా ఇండస్ట్రీలో పేరు, అవకాశాలు ఉంటాయని కొందరు నెటిజన్లు చాలా గొప్పగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లూ ఏమైపోయావమ్మా.. ఇప్పుడొచ్చి వయసు, బ్లాక్ చేశారంటూ కబుర్లు చెబుతున్నావ్.. నీ యూబ్యూట్ వ్యూస్‌ని పెంచుకుని, డబ్బు సంపాదించుకోవడానికి ఇతరులపై ఇలా కామెంట్స్ చేయడం ఎందుకు? ఇంకా ఏదైనా మార్గం ఎన్నుకోవచ్చు కదా.. అంటూ ఆమెకు కొన్ని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారండోయ్. (Netizens Comments on Bhanushree Mehra Tweet)


ఇవి కూడా చదవండి:

*********************************

*The Elephant Whisperers: వారి ఆనందానికి ఆస్కార్ అవార్డ్ ఏం సరిపోతుంది?

*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-25T13:07:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!