Vijayashanthi: దగ్గుబాటి హీరోలపై రాములమ్మ ఫైర్.. ఉద్యమాలు తప్పవంటూ..

ABN , First Publish Date - 2023-03-19T11:33:53+05:30 IST

థియేటర్‌లో విడుదలయ్యే ప్రతి సినిమాకి కచ్చితంగా సెన్సార్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

Vijayashanthi: దగ్గుబాటి హీరోలపై రాములమ్మ ఫైర్.. ఉద్యమాలు తప్పవంటూ..
Vijayashanti

థియేటర్‌లో విడుదలయ్యే ప్రతి సినిమాకి కచ్చితంగా సెన్సార్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం నియమించిన బోర్డు మూవీలో అసభ్యత లేకుండా చూసి విడుదలకి సర్టిఫీకెట్‌ని జారీ చేస్తుంది. అయితే.. ఓటీటీ (OTT) పరిస్థితి వేరు. అందులో వచ్చే కంటెంట్‌కి ఎటువంటి పరిమితులు, సెన్సార్ లేదు. దీంతో పరిమితికి మించిన అశ్లీలతని, అసభ్యతని ప్రసారం చేస్తున్నాయి. బూతులు డైలాగులతో పాటు సన్నీవేశాలను సైతం అడ్డుఅదుపు లేకుండా స్ట్రీమింగ్ చేస్తున్నాయి.

అయితే.. ట్రెండ్‌ని ఫాలో అవుతూ దగ్గుబాటి హీరోలైన బాబాయ్ వెంకటేశ్ (Venkatesh), అబ్బాయి రానా (Rana) ఓటీటీకి డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరు కలిసి తండ్రికొడుకులుగా ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైన ఈ సిరీస్ మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళుతోంది. అయితే.. ఈ వెబ్‌సిరీస్‌లో పరిమితికి మంచి అశ్లీల దృశ్యాలు, అసభ్య పదజాలం ఉన్నాయి. అది చాలామంది టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల ఆగ్రహానికి కారణమైంది. అందుకే దగ్గుబాటి హీరోలను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా ప్రముఖ నటి విజయశాంతి (Vijayashanti) సైతం ఈ సిరీస్‌పై స్పందిస్తూ.. దగ్గుబాటి హీరోలపై పరోక్షంగా ఫైర్ అయ్యారు.

విజయశాంతి సోషల్ మీడియాలో చేసిన పోస్టులో.. ‘ఇటీవలే విడుదలైన ఓ తెలుగు ఓటీటీ సిరీస్ చూసిన తర్వాత.. ఓటీటీలలో వచ్చే కంటెంట్‌కి కూడా కఠినమైన సెన్సార్‌ విధానం ఉండాలని అర్థమైంది. మహిళా వ్యతిరేకత తీవ్రమై ఉద్యమాల చేసే వరకు తెచ్చుకోకుండా ఉంటారని అనుకుంటున్నా. ఆ సిరీస్‌ను ఓటీటీలో నుంచి తొలగించాలని నటులు, నిర్మాతలను కోరుతున్నా. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో మహిళల నుంచి వ్యతిరేకతకి కారణం కాకుండా.. జాగ్రత్త ఉంటారని ఆశిస్తున్నా. ప్రజల అభిమానాన్ని గౌరవంతో నిలబెట్టుకుంటారని భావిస్తున్నా’ అని రాసుకొచ్చారు. అయితే.. ఈ పోస్టులో డైరెక్ట్‌గా రానా నాయుడు పేరు మాత్రం రాయలేదు. కానీ.. ఆ పోస్ట్ ఆ వెబ్‌సిరీస్ గురించేనని అందరికీ అర్థం అవుతోంది. దీంతో ఈ వైరల్ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ ‘మీరు చెప్పింది నిజం మేడమ్’ అంటూ ఆమెకి సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Allu Arjun: తన హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Updated Date - 2023-03-19T11:41:10+05:30 IST