Rana Naidu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బాబాయ్, అబ్బాయ్ వెబ్‌‌సిరీస్

ABN , First Publish Date - 2023-03-10T14:12:57+05:30 IST

టాలీవుడ్ హీరోలు వెంకటేశ్ దగ్గుబాటి (Venkatesh Daggubati), రానా దగ్గుబాటి (Rana Daggubati) ఓటీటీకి డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Rana Naidu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బాబాయ్, అబ్బాయ్ వెబ్‌‌సిరీస్

టాలీవుడ్ హీరోలు వెంకటేశ్ దగ్గుబాటి (Venkatesh Daggubati), రానా దగ్గుబాటి (Rana Daggubati) ఓటీటీకి డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బాబాయ్, అబ్బాయ్ కలిసి తాజాగా ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇందులో వీరిద్దరూ తండ్రికొడుకులుగా నటించారు. ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ వెబ్‌సిరీస్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. (OTT Streaming)

అనంతరం.. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, ట్రైలర్‌ ప్రేక్షకుల ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సిరీస్‌పై అంచనాలు ఇంకా పెరిగాయి. అమెరికన్ వెబ్‌‌సిరీస్ ‘ర్యాన్ అండర్సన్’ (Ryan Anderson) ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో సెలబ్రిటీలకి వచ్చే సమస్యలను తీర్చుతూ పలు స్కాండల్స్‌లో ఇరుక్కునే కొడుకుగా రానా.. జైలు నుంచి వచ్చిన తండ్రిగా వెంకటేశ్ నటించారు. భారీ అంచనాలు ఉన్న ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి (మార్చి 10) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గౌరవ్ చోప్రా, సుశాంత్ సింగ్, సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, ప్రియా బెనర్జీ, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ వెబ్‌సిరీస్ చూసిన కొందరు.. సోషల్ మీడియాలో స్పందిస్తూ బావుందంటూ పోస్టులు పెడుతున్నారు. తండ్రి, కొడుకుల్లో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారో తెలియనివ్వకుండా బాగా స్క్రీన్‌ప్లే చేశారని, చివరి రెండు ఎపిసోడ్స్ అయితే.. చాలా ఉత్కంఠ కలిస్తాయంటూ చెప్పుకొస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ చూసి ఎంజాయ్ చేయండి. (Rana Naidu)

ఇవి కూడా చదవండి:

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Updated Date - 2023-03-10T14:17:27+05:30 IST