Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2023-03-03T08:45:08+05:30 IST

అల్లు అర్జున్ (Allu Arjun).. ఈ పేరు కి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. ‘పుష్ప’ ముందు వరకు తెలుగు ప్రేక్షకులకి మాత్రమే ఎక్కువగా తెలిసిన ఈ ఐకాన్ స్టార్..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Allu Arjun

అల్లు అర్జున్ (Allu Arjun).. ఈ పేరు కి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. ‘పుష్ప’ ముందు వరకు తెలుగు ప్రేక్షకులకి మాత్రమే ఎక్కువగా తెలిసిన ఈ ఐకాన్ స్టార్.. ఆ మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు. తనదైన శైలితో పుష్ప రాజ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపాడు. బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల సునామీ సృష్టించాడు. అయితే ‘పుష్ప 2’ తర్వాత ఈ ఐకాన్ స్టార్ ఎవరితో సినిమా చేస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వారి ఎదురు చూపులకు తెరదించుతూ.. అర్జున్ రెడ్డి (Arjun reddy) దర్శకుడు సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగతో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌ను, సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. దర్శకుడిగా మొదటి సినిమాతోనే తనదైన ముద్రను వేసి భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సందీప్.

సందీప్ రెడ్డితో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను చేయనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను టీ సిరీస్ (T-series) ప్రొడక్షన్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించనున్నారు.

గతంలో అర్జున్ రెడ్డి సినిమా అల్లు అర్జున్ చేసుంటే ఇంపాక్ట్ గట్టిగా ఉండేదని దర్శకుడు సందీప్ పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐకాన్ స్టార్‌ను ఎలా చూపించనున్నాడో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-03T09:01:38+05:30 IST