Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

ABN , First Publish Date - 2023-03-07T11:35:15+05:30 IST

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొత్తం టాలీవుడ్ దర్శకుడు వెంకటేశ్ మహా (Venkatesh Maha) గురించే చర్చ జరుగుతోంది.

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా
Venkatesh Maha

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొత్తం టాలీవుడ్ దర్శకుడు వెంకటేశ్ మహా (Venkatesh Maha) గురించే చర్చ జరుగుతోంది. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్’ (KGF)పై సంచలన విమర్శలు చేశాడు. ఆ చిత్రంలోని రాఖీ భాయ్ (Rakhi Bhai) పాత్రపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కొంచెం ఘాటుగా స్పందించాడు. అలాంటి పాత్రని ప్రేక్షకులు ఇష్టపడతారని విమర్శలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ‘కేజీఎఫ్’ అభిమానుల కోపానికి కారణమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఘాటుగా స్పందించారు. కొందరైతే దారుణమైన దూషణలకి దిగారు. దీంతో ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా వెంకటేశ్ స్పందించాడు. తన మాట్లాడిన తీరుకి క్షమాపణలు చెబుతూ ఓ వీడియోని షేర్ చేశాడు.

అందులో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘నేను మాట్లాడిన మాటలు ఓ వర్గానికి చెందిన వ్యక్తుల అభిప్రాయం. అది నా అభిప్రాయం మాత్రమే కాదు. నా సినిమాలు నచ్చిన ఎంతోమంది నాకు చెప్పిన విషయాన్నే ఆ ఇంటర్వ్యూలో నేను తెలియజేశాను అంతే. అయితే.. అది మాట్లాడిన విధానం, వాడిన భాష సరైంది కాదు. దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ ఓ విషయం చెప్పాలి. నేను మాట్లాడిన మాటలు ఓ సినిమాలోని కల్పిత పాత్ర గురించి మాత్రమే. అంతేకానీ.. ఏ వ్యక్తిని కానీ, ఏ క్రియేటివ్ పర్సన్‌‌ని కానీ వ్యక్తిగతంగా అన్నమాట కాదు. నా మాటలను ఓ వ్యక్తికి ఆపాదించి చూడడం అనేది.. నా మాటలను మీరు చూసిన విధానం వల్ల వచ్చిన సమస్య కావచ్చు.

ఒకే, భావోద్వేగంలో నేను ఓ కల్పిత పాత్రని దూషించాను. దానికి నిజమైన మనిషైన నన్ను అసభ్యంగా తిట్టడం కరెక్ట్ కాదు. ఇది మొదటి సారి కాదు. ఎన్నోసార్లు ఇలాగే జరిగింది. అందుకే నాకు ఆ అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి.. బడ్జెట్‌ని బట్టి కాకుండా అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-07T12:22:58+05:30 IST