Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

ABN , First Publish Date - 2023-03-06T11:18:07+05:30 IST

నటి, పొలిటిషియన్ ఖుష్బూ సుందర్ (Kushboo Sunda) తన కన్నతండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి
Kushboo Sundar

నటి, పొలిటిషియన్ ఖుష్బూ సుందర్ (Kushboo Sundar) తన కన్నతండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై స్పందిస్తూ.. ఈ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్నతనంలో జరిగిన చేదు అనుభవాలను ఖుష్బూ వెల్లడించారు.

ఖుష్బూ మాట్లాడుతూ.. ‘చిన్నతనంలో లైంగిక వేధింపులకి (Child Abuse) గురైన చిన్న పిల్లలు అది అమ్మాయి కావచ్చు.. అబ్బాయి కావచ్చు.. జీవితాంతం భయపడుతూనే ఉంటారు. నా తల్లి అయితే అత్యంత భయంకరమైన వివాహ జీవితం. ఆమె భర్త, భార్యను, పిల్లలను కొట్టడం, తన ఏకైక కుమార్తెను లైంగికంగా వేధించడం తన జన్మహక్కుగా భావించే వ్యక్తి. అతను నాపై లైంగిక దాడి చేసేటప్పటికి నా వయసు కేవలం 8 సంవత్సరాలు మాత్రమే. అయితే.. అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం నా 15 ఏళ్ల వయసులో వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.

ఖుష్బూ ఇంకా మాట్లాడుతూ.. ‘అయితే మొదట్లో ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్మదమోనని భయం ఉండేది. ఎందుకంటే ఆమె ఏం జరిగిన నా భర్త దేవుడనే మైండ్‌సెట్‌తో ఉండేది. అందుకే ఎవరికీ చెప్పేదాన్ని కాదు. కానీ 15 ఏళ్లు తట్టుకోవడం కష్టమై.. అతనికి ఎదురు తిరగడం ప్రారంభించా. దాంతో అతను మమ్మల్ని ఉన్నపళంగా వదిలేసి వెళ్లిపోయాడు. దాని వల్ల మరుసటి రోజు తిండి దొరుకుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో బ్రతకాల్సి వచ్చింది. అనంతరం ధైర్యం కూడా గట్టుకుని పరిస్థితులకి ఎదురుగా పోరాడం ప్రారంభించాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

Amitabh Bachchan: ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్‌లో బిగ్‌ బీకి గాయాలు

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-06T11:18:08+05:30 IST