సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Oscar to RRR: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందనిదే..

ABN, First Publish Date - 2023-03-13T20:11:07+05:30

తెలుగోడి నాటు (Naatu Naatu Song) ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసింది ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం. తెలుగోడి సత్తాకు సంతకం అయిన ‘నాటు.. నాటు’ పాటకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డ్

RRR Movie Team with Oscar Award
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగోడి నాటు (Naatu Naatu Song) ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసింది ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం. తెలుగోడి సత్తాకు సంతకం అయిన ‘నాటు.. నాటు’ పాటకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డ్ వరించింది. దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు అభినందనలు తెలుపుతూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (Telugu Film Producers Council) ఓ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో.. (TFPC Letter on Oscar To RRR)

‘‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన రోజు 12 మార్చి 2023. అమెరికాలో జరిగిన 95వ ఆస్కార్ పురస్కార వేడుకల్లో (Oscar Awards) తెలుగు సినిమా RRR లోని “నాటు – నాటు’’ పాటకు ఆస్కార్ పురస్కారం (బెస్ట్ ఒరిజినల్ సాంగ్) రావడం తెలుగు సినిమా పరిశ్రమే కాకుండా భారతదేశం మొత్తం సినిమా పరిశ్రమకు గర్వకారణం.

ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరుపున ‘RRR’ సినిమా నిర్మాత శ్రీ D.V.V దానయ్య గారికి, దర్శకులు శ్రీ S.S రాజమౌళి (SS Rajamouli) గారికి, అద్భుతమైన సంగీతం అందించిన శ్రీ. M.M కీరవాణి (MM Keeravani) గారికి, ఇంత అద్భుతమైన పాట రాసిన చంద్రబోస్ గారికి, గాత్రం అందించిన శ్రీ. కాలభైరవ గారికి, మరియు రాహుల్ సిప్లిగంజ్ గారికి, ఆ పాటకి అద్భుతమైన డాన్స్ చేసిన ఇద్దరు హీరోలు శ్రీ నందమూరి తారక రామారావు (Jr NTR) గారికి (జూనియర్ ఎన్టీఆర్), శ్రీ. కొణిదెల రామ్ చరణ్ (Ram Charan) గారికి, ఆ డాన్స్ కు కొరియోగ్రఫీ అందించిన శ్రీ ప్రేమ్ రక్షిత్ గారికి, మరియు సినిమాకు పని చేసిన మొత్తం టీమ్‌కు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

భవిష్యత్తులో మన తెలుగు సినిమా పరిశ్రమకు (Tollywood) ఇటువంటి ఆస్కార్ అవార్డులు మరిన్ని రావాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఆకాంక్షిస్తుంది..’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

Updated Date - 2023-03-13T20:11:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!