Swapna Dutt: ‘అర్జున్ రెడ్డి’ చేయలేకపోయినందుకు బాధపడ్డా

ABN , First Publish Date - 2023-03-11T19:38:21+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన సినిమా ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy). సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Swapna Dutt: ‘అర్జున్ రెడ్డి’ చేయలేకపోయినందుకు బాధపడ్డా

టాలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన సినిమా ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy). సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ మూవీ భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కథ మొదట తన దగ్గరకే వచ్చిందని నిర్మాత స్వప్నదత్ (Swapna Dutt) చెప్పారు. స్టోరీ తనకు ఎంతో నచ్చినప్పటికి మూవీని చేయలేకపోయినట్టు తెలిపారు.

స్వప్నదత్ తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. ‘‘.. ‘అర్జున్ రెడ్డి ’ కథ నాకెంతో నచ్చింది. సినిమా కూడా హిట్ అవుతుందని తెలుసు. ఆ చిత్రాన్ని నిర్మించాలని ఎంతో ఆశపడ్డాను. కానీ, ధైర్యం చేయలేకపోయాను. ఒకవేళ సినిమా అటూ ఇటూ అయితే ఆడపిల్ల ఇటువంటి సినిమా చేసిందా? అని అంటారని భయపడ్డా. అందుకే మూవీని చేయలేపోయాను. ‘పెళ్లి చూపులు’ కూడా నా దగ్గరికి వచ్చింది. ఆ సినిమా ఫార్మాట్ కొత్తగా ఉండటంతో నాకు అర్థం కాలేదు. అందువల్ల ఆ చిత్రంపై నేను ఆసక్తి చూపించలేదు’’ అని స్వప్నదత్ చెప్పారు.

‘‘సినిమా ఇండస్ట్రీ అనేది మహిళలకు సురక్షిత ప్రదేశమే. నేను కెరీర్ ఆరంభించినప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగింది. మరింత మంది మహిళలు ఈ రంగంలోకి రావాలి. నిర్మాతలు కూడా మహిళలకు బాగా ప్రాధాన్యమిస్తున్నారు’’ అని స్వప్నదత్ పేర్కొన్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-11T19:40:40+05:30 IST