Dil Raju: స్వార్థపూరిత ఆలోచన‌తో ‘శాకుంతలం’ లో భాగస్వామిగా చేరాను

ABN , First Publish Date - 2023-03-29T16:58:37+05:30 IST

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో దిల్ రాజు (Dil Raju) ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 50 చిత్రాలను నిర్మించారు. నైజాం, వైజాగ్ ఏరియాల్లో మూవీస్‌ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు.

Dil Raju: స్వార్థపూరిత ఆలోచన‌తో ‘శాకుంతలం’ లో భాగస్వామిగా చేరాను

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో దిల్ రాజు (Dil Raju) ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 50 చిత్రాలను నిర్మించారు. నైజాం, వైజాగ్ ఏరియాల్లో మూవీస్‌ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఆయన తాజాగా ‘శాకుంతలం’ (Shaakuntalam) కు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 3డీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చాలా స్వార్థపరుడిని అని చెప్పారు.

‘‘..‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమా స్థాయి గ్లోబల్‌కు చేరింది. నేను ఇప్పటి వరకు 50 సినిమాలు చేశాను. తమిళ్‌లో ‘వారిసు’ చేశాను. హిట్ అయింది. ఇక్కడ చిన్న సినిమా ‘బలగం’ చేశాను. అది కూడా బాగుందన్నారు. సమంత (Samantha) తో గుణ శేఖర్ (Gunasekhar) శాకుంతలం సినిమా చేద్దామనుకున్నప్పుడు నేను ఈ ప్రాజెక్టులో లేను. సామ్ మేనేజర్ ఫోన్ చేసి కథ వినమన్నారు. ఇప్పటి వరకు గుణ శేఖర్‌తో సహా అందరు మోసపోయారు. ఈ ప్రాజెక్ట్‌లో వారికి సహాయం చేయడానికి నేను భాగస్వామిగా చేరననుకుంటున్నారు. నేను స్వార్థ పూరితంగా ఈ ప్రాజెక్ట్‌లో చేరాను. నేను భవిష్యత్తులో గ్లోబల్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. అందువల్ల విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకోవడానికి ఈ ప్రాజెక్టులో చేరాను. వీఎఫ్‌ఎక్స్ సినిమాలలో నిర్మాతలకు చాలా తక్కువ పని ఉంటుంది. ఈ ప్రాజెక్టులో చేరితే గుణ శేఖర్‌కు సహాయపడటంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకోవచ్చనే ఆలోచనతో ‘శాకుంతలం’ లో భాగస్వామిగా చేరాను. తెలుగు సినిమాలను ప్రపంచానికి చూపించాలి. దాని కోసం నేను వేసే మొదటి అడుగే శాకుంతలం సినిమా’’ అని దిల్ రాజు తెలిపారు.

‘శాకుంతలం’ లో సమంత (Samantha) శకుంతలగా నటించారు. దుష్యంతుడి పాత్రను దేవ్ మోహన్ పోషించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. పలు భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ దాదాపుగా రూ.80కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో భారత్‌లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టు ఇదే.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-29T19:08:38+05:30 IST