సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha- Rashmika Mandanna: సామ్ ఛాన్స్‌ను కొట్టేసిన రష్మిక

ABN, First Publish Date - 2023-04-03T16:35:22+05:30

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్‌లోను మూవీస్ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్‌లోను మూవీస్ చేస్తున్నారు. తొలిసారిగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రం ‘రెయిన్ బో’ (Rainbow) లో నటిస్తున్నారు. డెబ్యుటెంట్ శాంతరుబాన్ (Shantharuban) దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది. తెలుగు, తమిళ్‌లో రూపొందిస్తుంది. ఈ చిత్రం రొమాంటిక్ ఫాంటసీగా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 3న పూజా కార్యక్రమాలు జరుపుకొంది. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

కథనాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేస్తుండటంతో రష్మిక సంతోషం వ్యక్తం చేశారు. ‘‘కథను మహిళల కోణంలో చెప్పే సినిమాలో మొదటిసారిగా నటిస్తున్నాను. ఈ పాత్రను మీ ముందుకు తీసుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు క్రేజీగా ఫీల్ అవుతారు’’ అని రష్మిక తెలిపారు. రష్మిక అద్భుతమైన అభినయాన్ని ప్రేక్షకులు ఈ సినిమాలో చూస్తారని డైరెక్టర్ పేర్కొన్నారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మొదట ఈ సినిమాను సమంత (Samantha)తో ప్రకటించింది. ఏమైందో తెలియదు కానీ సామ్ మాత్రం ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. అనంతరం రష్మిక మందన్నాకు కథను వినిపించగా మూవీని చేసేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని నిర్మాతను అడగగా ఆయన స్పందించారు. ఒక కథ ఎవరికి రాసి పెట్టి ఉంటే వారే చేస్తారని చెప్పారు. ‘రెయిన్‌బో’ లో దేవ్ మోహన్ (Dev Mohan) హీరోగా చేస్తున్నారు. ఆయన సమంత సరసన ‘శాకుంతలం’ లోను నటించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

NTR 30: చిత్ర బృందానికి షాక్ ఇచ్చిన నటుడు

Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36

Janhvi Kapoor: స్టేజ్‌పై డ్యాన్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-03T16:35:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!