Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36

ABN , First Publish Date - 2023-04-02T17:06:09+05:30 IST

‘బాహుబలి’ అనంతరం తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఇక్కడి నుంచి వచ్చే చిత్రాలపై అందరు దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా మేకర్స్ కూడా ఖర్చుకు వెనుకాడకుండా భారీ స్థాయిలో మూవీస్‌ను నిర్మిస్తున్నారు.

Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36

‘బాహుబలి’ అనంతరం తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఇక్కడి నుంచి వచ్చే చిత్రాలపై అందరు దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా మేకర్స్ కూడా ఖర్చుకు వెనుకాడకుండా భారీ స్థాయిలో మూవీస్‌ను నిర్మిస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా తెలుగు సినిమాల రైట్స్‌ను దక్కించుకోవడానికి పోటీపడుతున్నాయి. భారీ స్థాయిలో ఆఫర్స్ ఇస్తున్నాయి.

నాని ప్రస్తుతం డెబ్యుటెంట్ శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘నాని 30’ (Nani 30) అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. తండ్రి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో మూవీ రూపొందనుంది. ‘నాని 30’ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది. డిజిటల్ రైట్స్ కోసం రూ.35కోట్లను చెల్లించిందని తెలుస్తోంది. డిజిటల్ రైట్స్‌కే రూ.35కోట్లను చెల్లిస్తే నాన్ థియేట్రీకల్ రెవెన్యూ రూ.70కోట్లను దాటుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Nani-30.jpg

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌బీకే 108’ (NBK 108) అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. డిజిటల్ రైట్స్ కోసం దాదాపుగా రూ.36కోట్లను ఆఫర్ చేసిందని సమాచారం అందుతుంది. బాలయ్య గత చిత్రాలు ‘వీర సింహారెడ్డి’, ‘అఖండ’ లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మంచి వీక్షణలు సంపాదించాయి. అందువల్ల ప్రైమ్ వీడియో భారీ ధరను చెల్లించిందట. ‘ఎన్‌బీకే 108’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Balakrishna.jpg^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Janhvi Kapoor: స్టేజ్‌పై డ్యాన్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-04-02T17:42:50+05:30 IST