Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

ABN , First Publish Date - 2023-04-01T17:15:34+05:30 IST

నేచురల్ స్టార్ నాని (Nani), కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). డెబ్యుటెంట్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందింది.

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

నేచురల్ స్టార్ నాని (Nani), కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). డెబ్యుటెంట్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందింది. పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్‌ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను రాబడుతుండగానే సినిమాలోని ఓ సన్నివేశంపై వివాదం రేగింది.

కీర్తి సురేశ్ ‘దసరా’ లో వెన్నెల అనే పాత్రను పోషించారు. అంగన్ వాడీ టీచర్‌గా నటించారు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో కీర్తి సురేశ్ కోడిగుడ్లను దొంగతనం చేసి అమ్ముకుంటున్నట్టు చూపించారు. ఆ గుడ్లను తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు చిత్రీకరించారు. ఈ సీన్‌పై అంగన్‌వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని థియేటర్ వద్ద ధర్నా చేశారు. ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. సన్నివేశాన్ని తొలగించకపోతే సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్స్ వద్ద నిరసనకు దిగుతామని హెచ్చరించారు.

dasarafirstdayfirstshow.jpg

దసరా సినిమా వీర్లపల్లి అనే గ్రామం నేపథ్యంలో రూపొందింది. చిత్రంపై విడుదలకు ముందే భారీ బజ్ ఉంది. మూవీ ఆ అంచనాలను మించి రాణిస్తుంది. వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లోనే రూ.53కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లోను వన్ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ను ఇప్పటికే కొల్లగొట్టింది. ఈ సినిమా పూర్తి రన్‌లో 2మిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pushpa: The Rule: డిజిటల్ రైట్స్ కోసం పోటీపడుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్!

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-04-01T17:25:48+05:30 IST