Janhvi Kapoor: స్టేజ్‌పై డ్యాన్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

ABN , First Publish Date - 2023-04-01T18:41:40+05:30 IST

అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’ చిత్రంతో వెండితెర పైకి రంగ్ర ప్రవేశం చేశారు.

Janhvi Kapoor: స్టేజ్‌పై డ్యాన్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’ చిత్రంతో వెండితెర పైకి రంగ్ర ప్రవేశం చేశారు. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘గుడ్ లక్ జెర్రీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఆమె సోషల్ మీడియాలోను చాలా చురుకుగా ఉంటారు. వరుసగా పోస్ట్‌లు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే, జాన్వీని నెటిజన్స్ తాజాగా ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణమేంటంటే..

జాన్వీ కపూర్ తాజాగా ఓ వేడుకకు హాజరయ్యి స్టేజ్‌పై స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులందరు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆమె డ్యాన్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇంత ఘోరంగా డ్యాన్స్ చేస్తారా’’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ‘‘ఆమె డ్యాన్స్ ఎక్కడ చేసింది’’ అని మరొకరు తెలిపారు. ట్రోలర్స్‌కు ధీటుగా ఆమె అభిమానులు స్పందించారు. ‘‘డ్యాన్స్‌తో ప్రాణాలు తీసేస్తావా’’ అని ఒకరు చెప్పారు. ‘‘పూర్తి స్థాయి ప్రదర్శన చూడాలనుకుంటున్నాను’’ అని మరొకరు పేర్కొన్నారు. ‘‘నేటి తరంలో ఉత్తమ డ్యాన్సర్ జాన్వీనే’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ స్పష్టం చేశారు.

Janhvi.jpg

జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్ సరసన ‘బవాల్’ (Bawal) లో నటించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. రాజ్ కుమార్ రావ్‌తో కలసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటుంది. ఆమె టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘ఎన్టీఆర్ 30’ (NTR 30)లో హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pushpa: The Rule: డిజిటల్ రైట్స్ కోసం పోటీపడుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్!

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-04-01T18:58:20+05:30 IST