Rajinikanth: దిల్ రాజు బ్యానర్‌లో రజినీ.. డైరెక్టర్ ఎవరంటే..?

ABN , First Publish Date - 2023-04-12T20:34:14+05:30 IST

టాలీవుడ్‌లోని అగ్రనిర్మాతల్లో దిల్ రాజు (Dil Raju) ఒకరు. సినిమాలను నిర్మించడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటారు. ఆయన ఈ మధ్యనే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్ (Vijay) తో ‘వారిసు’ (Varisu) ను నిర్మించారు.

Rajinikanth: దిల్ రాజు బ్యానర్‌లో రజినీ.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్‌లోని అగ్రనిర్మాతల్లో దిల్ రాజు (Dil Raju) ఒకరు. సినిమాలను నిర్మించడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటారు. ఆయన ఈ మధ్యనే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్ (Vijay) తో ‘వారిసు’ (Varisu) ను నిర్మించారు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వారిసు సినిమా తెలుగులోకి ‘వారసుడు’ టైటిల్‌‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ లోను ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. దిల్ రాజు మరో కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయనున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

దిల్ రాజు బ్యానర్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించనున్నారని సమాచారం అందుతుంది. తెలుగు, తమిళ్ బై లింగ్విల్‌గా సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును యంగ్ డైరెక్టర్ బాబీ (Bobby) తెరకెక్కించనున్నారట. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను దిల్ రాజు త్వరలోనే మీడియాకు వెల్లడిస్తారట. టీజే. జ్ఞానవేల్ (TJ. Gnanavel) తోను రజినీ సినిమా చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూనే బాబీతో సినిమా చేయనున్నారట. రజినీ, బాబీ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని సమచారం అందుతుంది. బాబీ చివరగా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) కు దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని అందుకుంది.

Bobby.jpg

దిల్ రాజు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాగా రూపొందిస్తున్నారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో ‘రావణం’ ను చేయనున్నట్టు చెప్పారు. బాలకృష్ణ, చిరంజీవి, యశ్ తదితరులందరితో త్వరలోనే సినిమాలు ఉంటాయని పేర్కొన్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SSMB29: పురాణాల స్ఫూర్తితో మహేశ్ బాబు పాత్ర

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాకు సీక్వెల్!

Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Updated Date - 2023-04-12T20:34:15+05:30 IST