Project K: రైడర్స్ అంటే ఎవరు..?

ABN , First Publish Date - 2023-04-10T13:09:42+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K). దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. బడా ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ రూ. 500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.

Project K: రైడర్స్ అంటే ఎవరు..?

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K). దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. బడా ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ రూ. 500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. మూవీ వైవిధ్య భరితంగా ఉంటుందని నాగ్ అశ్విన్ కొంత కాలంగా చెబుతున్నారు. అన్నింటిని కొత్తగా క్రియేట్ చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. నూతన సంవత్సరం కానుకగా గతంలో ‘స్క్రాచ్ ఎపిసోడ్ 1: రీ ఇన్వెటింగ్ ది వీల్’ అనే టైటిల్‌తో‌ను ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఒక టైర్‌ను రూపొందించడానికి పడిన కష్టాన్ని అందులో చూపించారు. తాజాగా మరో వీడియోను విడుదల చేశారు.

‘స్క్రాచ్ ఎపిసోడ్ 2: అసెబ్లింగ్ ది రైడర్స్’ అనే టైటిల్‌తో వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రైడర్స్ అంటే ఎవరో వివరించారు. వారి దుస్తుల కోసం జరిగిన కసరత్తుని అందులో చూపించారు. వీడియోలో కొంచెం హాస్యాన్ని కూడా మేళవించారు. ‘ప్రాజెక్ట్ కె’ కు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నారు. ‘మహానటి’ అనంతరం నాగి నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో ‘ప్రాజెక్ట్ కె’ పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే మూవీ రూపొందుతున్నట్టు తెలుస్తోంది.

Prabhas.jpg

స్క్రిఫ్ట్, ప్రొడక్షన్ డిజైన్ పరంగా ‘ప్రాజెక్ట్ కె’ పూర్తి కొత్తగా ఉండబోతున్నట్టు నాగ్ అశ్విన్ కొంత కాలంగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం పాన్‌ ఇండియాగా రూపొందుతుంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సినిమా ఉండబోతుందని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. మూవీని 2024 జనవరి 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Updated Date - 2023-04-10T13:12:13+05:30 IST