Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2023-04-06T19:57:34+05:30 IST

బాలీవుడ్‌ సూపర్ స్టార్స్‌లో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఒకరు. మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్‌ సూపర్ స్టార్స్‌లో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఒకరు. మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సల్మాన్ తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. బాలీవుడ్ యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘‘యంగ్ హీరోలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారికి సినిమా అంటే ఎంతో ఇష్టం. వారి భవిష్యత్ ప్రణాళికలు కూడా బాగున్నాయి. కానీ, ఈ యంగ్ హీరోలంతా డబ్బుల కోసం పరుగులు పెడుతున్నారు. మేం ఐదుగురం సల్మాన్‌, షారూఖ్, ఆమిర్, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌ సీనియర్‌ హీరోలమయ్యామని అలసిపోయమాని వారు అనుకుంటున్నారు. కానీ, మేము అంత త్వరగా ఏ సినిమాలను వదులుకోం. అన్ని రకాల చిత్రాలు చేస్తాం. మా డేట్స్ అందుబాటులో లేకపోతే నిర్మాతలు యంగ్ హీరోలను ఆశ్రయిస్తారు. వారు సినిమాల హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా రెమ్యునరేషన్‌‌ను అమాంతం పెంచేస్తున్నారు. మేమంతా కలసి ఆ హీరోస్ గురించి తప్పకుండా ఆలోచిస్తాం’’ అని సల్మాన్‌ ఖాన్‌ చెప్పారు. సల్మాన్ వ్యాఖ్యలు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీ కూడా ఆ వ్యాఖ్యల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంది.

Kisi-Ka-Bhai-Kisi-Ki-Jaan.jpg

సల్మాన్‌ ఖాన్ తాజాగా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) లో నటించారు. ఈ చిత్రంలో ఫూజా హెగ్డే (Pooja Hegde) హరోయిన్‌గా చేశారు. ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జగపతిబాబు, వెంకటేశ్, షెహనాజ్‌ గిల్‌, విజేందర్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మెగా హీరో రామ్‌ చరణ్‌ (Ram charan) అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Salman Khan: ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-06T19:57:35+05:30 IST