Pawan Kalyan- Bandla Ganesh: ‘డాలర్ శేషాద్రితో కష్టం బ్రదర్’.. బండ్ల సెట్లైర్లు త్రివిక్రమ్‌ గురించేనా!?

ABN , First Publish Date - 2023-03-19T13:49:55+05:30 IST

ఈ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు బండ్ల గణేశ్..

Pawan Kalyan- Bandla Ganesh: ‘డాలర్ శేషాద్రితో కష్టం బ్రదర్’.. బండ్ల సెట్లైర్లు త్రివిక్రమ్‌ గురించేనా!?
Bandla Ganesh

ఈ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు బండ్ల గణేశ్ (Bandla Ganesh). బండ్ల గణేశ్ సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌పై ఉన్న అభిమానాన్ని పలు రకాలుగా బయటపెడుతుండేవాడు. ముఖ్యంగా పవన్‌కి సంబంధించిన ఏదైనా మూవీ ఫంక్షన్ జరిగితే గణేశ్‌ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఆ సమయంలో గణేశ్ ఇచ్చే స్పీచ్‌లకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే.. గత కొంతకాలంగా పవన్‌కి, గణేశ్‌కి మధ్య కాస్తా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే.

అందుకే సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్‌ని విమర్శిస్తూ పరోక్షంగా పోస్టులు చేశారు. ముఖ్యంగా పవన్ స్నేహితుడు, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) గురించి ఎక్కువగా సందర్భాల్లో ఆయన పేరు వాడకుండా విమర్శలు చేశాడు. ముఖ్యంగా సినిమా ఈవెంట్లకి తనని పిలవనివ్వకుండా త్రివిక్రమ్ అడ్డుపడుతున్నాడని గణేశ్ పలుమార్లు విమర్శించాడు. అయితే.. గణేశ్ వ్యాఖ్యలపై పలువురు పవన్ అభిమానులు స్పందిస్తూ పవన్‌ని దూరం పెట్టొదని రిక్వెస్ట్ చేశారు. (Bandla Ganesh indirect satires on trivikram)

‘బండ్ల గణేశ్ అన్న అపార్థం చేసుకుని పవన్ అన్నకీ దూరంగా ఉండకు... ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి కొంచెం రిలీఫ్ నీలాంటి వాళ్లే.. సమయం దొరికినప్పుడు కలువు.. ఆయన్నీ అర్థం చేసుకోలేక చాలా మంది సన్నిహితులు దూరం అయ్యారు.. మీరు అలా కావద్దు’ అని పవన్ అభిమాని ఒకరు గణేశ్‌ని రిక్వెస్ట్ చేశాడు. దానికి గణేశ్ తాజాగా స్పందించాడు. అందులో.. ‘మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్ ………!’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ‘ఆ డాలర్ శేషాద్రి ఎవరు’ అని కొందరూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరేమో ‘ఇంకెవరు త్రివిక్రమ్ గురించే మాట్లాడుతున్నాడు’ అని చెప్పుకొస్తున్నారు. (Bandla Ganesh)

ఇవి కూడా చదవండి:

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Updated Date - 2023-03-19T13:51:10+05:30 IST