సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Oscars 2023: రామ్ చరణ్, తారక్ కాదు.. ఆస్కార్స్‌లో ‘నాటు నాటు’ కు డ్యాన్స్ చేస్తున్నదెవరంటే..?

ABN, First Publish Date - 2023-03-11T18:54:27+05:30

ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ కోసం పోటీపడుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ కోసం పోటీపడుతుంది. అకాడమీ అవార్డ్స్‌ను మార్చి 13న ప్రదానం చేయనున్నారు. పురస్కారాల సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ‘నాటు నాటు’ ను ఆస్కార్ స్టేజ్‌పై పాడనున్నారు. రామ్ చరణ్, తారక్ కూడా ఈ సాంగ్‌కు స్టెప్పులేస్తారని అభిమానులందరు భావించారు. కానీ, హీరోలు మాత్రం స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం లేదు. తాజాగా ఆ అవకాశం మరొకరికి లభించింది.

అమెరికన్ నటి, డ్యాన్సర్ లారెన్ గాట్లిబ్ (Lauren Gottlieb) ‘నాటు నాటు’ కు డ్యాన్స్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా లారెనే చెప్పారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘మీకో గుడ్ న్యూస్. ఆస్కార్స్‌లో ‘నాటు నాటు’ కు నేను డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వబోతున్నాను’’ అని లారెన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. లారెన్ గాట్లిబ్ గతంలో డ్యాన్స్ రియాలిటీ షో ‘ఝలక్ దిఖలా జా 6’ (Jhalak Dikhlaa Jaa 6) రన్నరప్‌గా నిలిచారు. బాలీవుడ్ చిత్రం ‘ఎబీసీడీ: ఎనీబడ్ కెన్ డ్యాన్స్’ (ABCD: Any Body Can Dance) లోను నటించారు.

‘ఆర్ఆర్ఆర్’ ను అల్లూరి సీతా రామ రాజు, కొమరం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. 1920ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని సైతం ఈ మూవీ కైవసం చేసుకుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-11T18:57:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!