Chiranjeevi: యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న చిరు

ABN , First Publish Date - 2023-04-12T21:32:05+05:30 IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే రెండు చిత్రాలను విడుదల చేశారు. ‘గాడ్ ఫాదర్’ (God Father), ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

Chiranjeevi: యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న చిరు

టాలీవుడ్ టాప్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే రెండు చిత్రాలను విడుదల చేశారు. ‘గాడ్ ఫాదర్’ (God Father), ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ (Bhola Shankar) లో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత చిరు నెక్ట్స్ ప్రాజెక్టు ఫిక్స్ అయింది. యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

తొలి సినిమా ‘బింబిసార’ (Bimbisara) తోనే బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ట (Vasishta). చిరంజీవికి ఓ స్క్రిఫ్ట్‌ను వినిపించారు. వశిష్ట వినిపించిన కథకు చిరు ఫిదా అయ్యారు. నెక్ట్ ప్రాజెక్టుగా వెంటనే దానిని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ మూవీని బడా ప్రొడక్షన్ హౌస్ యువీ క్రియేషన్స్ నిర్మించనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందించనుంది. చిరు నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తారట. కొంత కాలంగా మెగాస్టార్ యంగ్ డైరెక్టర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. వెంకీ కుడుముల (Venky Kudumula) తో సినిమా చేయనున్నట్టు చెప్పారు. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఏమైందో తెలియదు కానీ సినిమా మాత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది.

Bimbisara.jpg

చిరంజీవి చివరగా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) లో నటించారు. ఈ సినిమాను బాబీ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SSMB29: పురాణాల స్ఫూర్తితో మహేశ్ బాబు పాత్ర

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాకు సీక్వెల్!

Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Updated Date - 2023-04-12T21:38:08+05:30 IST