scorecardresearch

Chiranjeevi: కొత్త కారు కొన్న చిరంజీవి.. ధర వింటే షాకే..

ABN , First Publish Date - 2023-04-12T19:42:37+05:30 IST

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కారు టయోట వెల్‌ఫైర్ (Toyota Vellfire)కు తన గ్యారేజీలో చోటిచ్చారు. నలుపు రంగులో ఉన్న కారును ఆయన సొంతం చేసుకున్నారు.

Chiranjeevi: కొత్త కారు కొన్న చిరంజీవి.. ధర వింటే షాకే..

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కారు టయోట వెల్‌ఫైర్ (Toyota Vellfire)కు తన గ్యారేజీలో చోటిచ్చారు. నలుపు రంగులో ఉన్న కారును ఆయన సొంతం చేసుకున్నారు. ఈ కారు ఆన్ రోడ్ ధర హైదరాబాద్‌లో రూ1.19కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ వాహనం రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు. కొణిదెల చిరంజీవి పేరుతో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిరు ఈ కారు కోసం ఫ్యాన్సీ నంబర్ టీఎస్09జీబీ1111 కొనుగోలు చేశారు. దాదాపుగా రూ.4.7లక్షలు చెల్లించి ఆ నంబర్‌ను కొన్నారని సమాచారం. వాహనం రిజిస్ట్రేషన్ కోసం డిజిటల్ సంతకం చేయాల్సి ఉండటంతో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని మెగాస్టార్ స్వయంగా సందర్శించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు విపరీతంగా వాటిని షేర్ చేస్తున్నారు.

Chiranjeevi.jpg

చిరంజీవి చివరగా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ‘వాల్తేరు వీరయ్య’ ఇచ్చిన జోష్‌తో చిరు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ‘భోళా శంకర్’ (Bhola Shankar) లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SSMB29: పురాణాల స్ఫూర్తితో మహేశ్ బాబు పాత్ర

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాకు సీక్వెల్!

Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Updated Date - 2023-04-12T19:43:36+05:30 IST