Ravanasura: మాస్ మహారాజా మాంచి అప్‌డేట్‌తో వచ్చాడోచ్..

ABN , First Publish Date - 2023-03-01T20:54:27+05:30 IST

ఈ మధ్య వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja). ప్రస్తుతం ఆయన హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న

Ravanasura: మాస్ మహారాజా మాంచి అప్‌డేట్‌తో వచ్చాడోచ్..
Ravi Teja in Ravanasura

ఈ మధ్య వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja). ప్రస్తుతం ఆయన హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). మరో హీరో సుశాంత్ (Sushanth) కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా (Abhishek Nama), రవితేజ (Ravi Teja) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్ర షూటింగ్‌ని పూర్తి చేశారని ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మాంచి అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

ఆ అప్‌డేట్ ఏమిటంటే.. ఈ చిత్ర టీజర్‌ని మార్చి 6వ తేదీన ఉదయం 10 గంటల 08 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పిక్‌లో రవితేజ ట్రెండీగా, క్రూయల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో రవితేజ ఫ్యాన్స్ యమా హ్యాపీగా ఉన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. (Ravanasura Teaser Update)

భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర బృందం తెలుపుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameswar) మరియు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకుని మిలియన్ల వ్యూస్‌ని సాధించి.. సినిమాపై క్రేజ్‌ని పెంచాయి. కాగా, శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించగా.. రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel), మేఘా ఆకాష్ (Megha Akash), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), దక్షా నాగర్కర్ (Daksha Nagarkar), పూజిత పొన్నాడ (Poojitha Ponnada)లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

* Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

* Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

* Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

* Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

* Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

Updated Date - 2023-03-01T20:54:29+05:30 IST