Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-03-01T20:13:30+05:30 IST

నటి పూర్ణ (Poorna).. పరిచయం అక్కరలేని పేరు. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డ్యాన్స్ షోలకు జడ్జిగా.. ఇలా పలు పాత్రలను విజయవంతంగా నిర్వహించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కొన్నాళ్ల క్రితమే బిజినెస్‌మ్యాన్

Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్
Actress Poorna

నటి పూర్ణ (Poorna).. పరిచయం అక్కరలేని పేరు. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డ్యాన్స్ షోలకు జడ్జిగా.. ఇలా పలు పాత్రలను విజయవంతంగా నిర్వహించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కొన్నాళ్ల క్రితమే బిజినెస్‌మ్యాన్ షానిద్ అసిఫ్‌ అలీ (Shanid Asif Ali)ని ఆమె వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న కొన్ని రోజులకే ప్రెగ్నెంట్ (Pregnant) అనే గుడ్ న్యూస్‌ని ఆమె అందరికీ షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక అప్పటి నుంచి పూర్ణ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూనే ఉంది. రీసెంట్‌గానే ఆమె సీమంతపు (Seemantham) వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. తాజాగా మరో వేడుకను పూర్ణ జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించి వీడియోను, ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది తమ సంప్రదాయ తంతు అని ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆమె షేర్ చేసిన వీడియోలో.. ఓ తెల్లటి వస్త్రాన్ని ఆమె నడుము చుట్టు కట్టి.. దానిని నల్లటి దారంతో ముడి వేశారు. చూసే వాళ్లకి ఇదేం వేడుక అని అనిపించినా.. ఇది తమ సంప్రదాయ వేడుక అని పూర్ణ చెప్పుకొచ్చింది. ‘‘మా ఆచారంలో ఏడో నెల వచ్చిన గర్భిణీకి.. ఇలా ‘కానూర్’ (Kannur Tradition) అనే వేడుకను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తయినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను’’ అని పూర్ణ తన పోస్ట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన కొందరు ‘ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అంటే.. ‘ఇదేం ఆచారం’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక పూర్ణ విషయానికి వస్తే.. అవును (Avunu), అవును2 (Avunu 2), సీమటపాకాయ్ (Seema Tapakai) వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన పూర్ణ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ (Akhanda) చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఆమె నటనకు దూరంగా ఉంటున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ ఆమె రీ ఎంట్రీ ఇచ్చే అవకాశమైతే లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో..


ఇవి కూడా చదవండి

*********************************

Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

* Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

* Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

* Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

* Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

* Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

Updated Date - 2023-03-01T20:13:34+05:30 IST