Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

ABN , First Publish Date - 2023-02-23T21:04:04+05:30 IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy).. ఓటీటీలోకి వచ్చేసింది. రావడం రావడమే ఊచకోతను మొదలెట్టిందీ చిత్రం. సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!
Balakrishna in Veera Simha Reddy Movie

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy).. ఓటీటీలోకి వచ్చేసింది. రావడం రావడమే ఊచకోతను మొదలెట్టిందీ చిత్రం. సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాకుండా.. బాలయ్య (Balayya) కెరీర్‌లోనే అత్యత్తుమ కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలై.. ప్రేక్షకులకి మరింత చేరువైంది. అయితే థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని ఎదురుచూస్తున్న వారికి షాకిచ్చేలా.. విడుదలైన నిమిషంలోనే ఒక లక్షా యాభై వేల (150K) యూనిక్ వ్యూవర్స్‌ని సొంతం చేసుకుని రికార్డ్‌‌ను క్రియేట్ చేసింది. ఈ విషయం అధికారికంగా.. ఈ సినిమా విడుదలైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఓటీటీ సంస్థ ప్రకటిస్తూ.. ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

‘వీరసింహారెడ్డి’ కథ (Veera Simha Reddy Story) విషయానికి వస్తే.. ఇది రాయలసీమలో జరిగే ఒక ఫ్యాక్షన్ కథ. జై (నందమూరి బాలకృష్ణ) అతని తల్లి మీనాక్షి (హనీ రోజ్) తో ఇస్తాంబుల్‌లో హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఒక సంఘటనలో అతనికి ఈషా (శృతి హాసన్) అనే అమ్మాయి పరిచయమై.. ఆ పరిచయం పెళ్ళి వరకు వెళుతుంది. ఈషా తండ్రి (మురళీ శర్మ) ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. జై తల్లిదండ్రులతో మాట్లాడాలి అని చెప్పగా... జై తనకి తండ్రి లేడని చెబితే.. తల్లి మీనాక్షి అతనికి తండ్రి వున్నాడని.. అతను మరెవరో కాదు రాయలసీమలో అందరూ దేవుడుగా భావిస్తున్న వీరసింహారెడ్డి (బాలకృష్ణ) అని చెబుతుంది. మీనాక్షి కబురు చేయగానే సీమ నుండి వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. అతనిని వెతుక్కుంటూ ప్రత్యర్థి ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్), అతని భార్య భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) ఇస్తాంబుల్ వచ్చి వీరసింహారెడ్డిపై ఎటాక్ చేస్తారు. అయితే వీరసింహారెడ్డిపై ఎటాక్ చేసిన భానుమతి మరెవరో కాదు.. వీరసింహారెడ్డి చెల్లెలు అని తెలుస్తుంది. ఎందుకు చెల్లెలైన భానుమతి.. అన్న వీరసింహారెడ్డిని చంపాలని అనుకుంటుంది? మీనాక్షి, వీరసింహారెడ్డి ఎందుకు విడిపోయారు? మీనాక్షి ఇస్తాంబుల్‌లో ఎందుకుంది? ప్రతాప్ రెడ్డి‌కి ఎందుకు అంత పగ? ఇవన్నీ తెలియాలంటే తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.

బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో.. మాసియస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ ‘వీరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కింది. థియేటర్లలో ఈ చిత్రం వీరమాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని (Naveen Yerneni), వై రవిశంకర్ (Y Ravi Shankar) భారీగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. బాలయ్య సరసన శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించింది.


ఇవి కూడా చదవండి

*********************************

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Ram Charan: ఆ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్

Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం

Updated Date - 2023-02-24T00:40:08+05:30 IST