Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

ABN , First Publish Date - 2023-02-27T17:52:25+05:30 IST

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) ఫిల్మ్ అవార్డ్స్‌లో RRR హవా కొనసాగిందని తెలిసి చాలా సంతోషించానని అన్నారు.. దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel Star Krishnam Raju) సతీమణి

Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది
Krishnam Raju's Wife Shyamala Devi

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) ఫిల్మ్ అవార్డ్స్‌లో RRR హవా కొనసాగిందని తెలిసి చాలా సంతోషించానని అన్నారు.. దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel Star Krishnam Raju) సతీమణి శ్యామలా దేవి (Shyamala Devi). అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే పలు అవార్డులతో సత్తా చాటిన రాజమౌళి మార్క్ చిత్రం ఆర్ఆర్ఆర్.. తాజాగా హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల్లో ఏకంగా ఐదు అవార్డులు కొల్లగొట్టి భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి మాట్లాడుతూ.. ‘‘రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (Hollywood Critics Association) ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’, ‘ఉత్తమ యాక్షన్ చిత్రం’, ‘ఉత్తమ స్టంట్స్’, ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’, ‘స్పాట్‌లైట్’ విభాగంలో అవార్డులు గెలిచి తెలుగు సినిమా సత్తా చాటింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేదికపై ఆర్ఆర్ఆర్ సాధించిన ఈ విజయంతో ఆస్కార్‌ (Oscars 2023) కూడా మనకు దగ్గరలోనే ఉందని నాకనిపోస్తోంది.

Ram-charan.jpg

ఈ ఘనత సాధించిన రాజమౌళిగారికి, చిరంజీవులు రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR)లకు నా శుభాభినందనలు. సంగీతం అందించిన కీరవాణిగారు (MM Keeravani) సహా సినిమా కోసం పని చేసిన అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి అద్బుతమైన దృశ్య కావ్యాన్ని మనకు అందించిన నిర్మాత దానయ్య‌ (DVV Danayya)గారు ఇలాంటి సినిమాలు మరిన్ని అందించాలని అభిలషిస్తున్నా. టీం మొత్తానికి కృష్ణంరాజు‌గారి ఆశీస్సులు ఉంటాయి..’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

*********************************

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-27T17:52:29+05:30 IST