KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

ABN , First Publish Date - 2023-02-28T21:38:11+05:30 IST

‘కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా..’ ఇది ‘నరసింహనాయుడు’ (Narasimha Naidu) సినిమాలోని డైలాగ్. ఇప్పుడు తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ (KTR) కూడా తన కంటి సైగతో

KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..
KTR at Balagam Movie Event

‘కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా..’ ఇది ‘నరసింహనాయుడు’ (Narasimha Naidu) సినిమాలోని డైలాగ్. ఇప్పుడు తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ (KTR) కూడా తన కంటి సైగతో యాంకర్‌ని హడలెత్తించి హీరోయిజం ప్రదర్శించారు. ఇంతకీ ఈ సీన్ ఎక్కడ జరిగి ఉంటుందని అనుకుంటున్నారా? దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్, శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’ (Balagam). ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (Balagam Movie Pre Release Event) మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ వేడుకలో ఓ సందర్భంలో స్టేజ్ ఎదురుగా కూర్చుని ఉన్న కేటీఆర్ ఓ సైగ చేశారు. ఆ సైగకు స్టేజ్‌పై ఉన్న యాంకర్ ఒక్కసారిగా భయపడిపోయింది. అయితే ఆ భయాన్ని ఫేస్‌లో కనబడనీయకుండా.. కేటీఆర్ చెప్పిన పని చేసి.. కామ్‌గా పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విషయంలోకి వస్తే.. గెస్ట్‌గా వచ్చిన దర్శకుడు అనుదీప్ కేవీ (Anudeep KV)ని స్టేజ్‌పైకి యాంకర్ పిలిచిన సమయంలో.. మరో అతిథి హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ఎంటరయ్యారు. అనుదీప్‌ మాట్లాడబోతుంటే.. యాంకర్ ఆపేసి.. సిద్ధుకి స్వాగతం పలికింది. ఇంతలో కేటీఆర్ కలగజేసుకుని.. కంటి చూపుతోనే ‘మైక్ అనుదీప్‌కి ఇవ్వు’ అన్నట్లుగా సైగ చేశారు. ఇది గమనించిన యాంకర్ (Anchor) వెంటనే మైక్ అనుదీప్‌కి ఇచ్చేసి పక్కకి వెళ్లిపోయింది. అతనికి మైక్ ఇవ్వు అని.. కేటీఆర్ చెప్పినప్పుడు యాంకర్ ఫేస్ ఒక్కసారిగా మారిపోయింది. మళ్లీ నవ్వుతూ.. మైక్ ఇచ్చేసి అనుదీప్‌ని మాట్లాడమంటూ యాంకర్ వెళ్లిపోతుండటం ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.

KTR-2.jpg

ప్రియ‌ద‌ర్శి (Priyadarshi), కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన ‘బలగం’ చిత్రం కమెడియన్ వేణు ఎల్దండి (Venu Yeldandi) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కింది. ప్రస్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ‘యు’ స‌ర్టిఫికేట్ పొందిన ఈ సినిమా.. మార్చి 3న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఇవి కూడా చదవండి

*********************************

Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..

Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-28T21:38:17+05:30 IST