Ram Charan: లాస్ ఏంజెలెస్‌లో మెగా పవర్ స్టార్ మీట్ అండ్ గ్రీట్

ABN , First Publish Date - 2023-03-12T17:17:23+05:30 IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హీరోగా నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పురస్కారం కోసం పోటీపడుతుంది.

Ram Charan: లాస్ ఏంజెలెస్‌లో మెగా పవర్ స్టార్ మీట్ అండ్ గ్రీట్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హీరోగా నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పురస్కారం కోసం పోటీపడుతుంది. రామ్ చరణ్ ఆస్కార్ ప్రమోషన్స్‌‌‌ను లాస్ ఏంజెలెస్‌లో బిజీగా చేస్తున్నారు. అయినప్పటికి ఆ షెడ్యూల్‌లోను అభిమానుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు. మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Mega-Power-Star.jpg

అమెరికాలోని ప‌లు ఫ్యాన్స్ గ్రూప్స్ ఆధ్వ‌ర్యంలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ జ‌రిగింది. లాస్ ఏంజెలెస్‌లో మార్చి 11న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన అభిమానులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అభిమానులు రామ్ చరణ్‌తో సరదాగా సంభాషించారు. కొంత మంది ఫొటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులద్దేశించి చెర్రీ మాట్లాడారు. ‘‘ఇండియాలో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడం సులభంగా ఉంటుంది. కానీ, అమెరికాలో ఎంత కష్టమో నాకు తెలుసు. మా మీదున్న అభిమానంతో అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి మీరు వచ్చారు. ఇక్కడకు వచ్చిన అభిమానులు అందరికీ కృతజ్ఞతలు చెప్పడం చాలా చిన్నది అవుతుంది. మీ అభిమానాన్ని గుండెల్లో దాచి పెట్టుకుంటా. ఇలా అభిమానించే వాళ్లను కలిసినప్పుడు మాలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ వేదిక మీద ఇంతమంది అభిమానులను కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ ఆధారాభిమానాల వల్లే ఈ స్టేజ్‌లో ఉన్నాను’’ అని రామ్ చరణ్ తెలిపారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లోని ‘నాటు నాటు’ ఆస్కార్‌కు నామినేట్‌ కావటంపై కూడా రామ్‌చరణ్‌ స్పందించారు.  ‘‘ఈ ట్రిప్‌ను ఎప్పటికీ మరచిపోలేను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తో తెలుగువాడిగా, భారతీయుడిగా మనమంత చరిత్ర సృష్టించబోతున్నాం. ఈ హిస్టరీలో మీరంతా కూడా భాగమే! ఈరోజు దాని విలువ మనకు తెలుసో, లేదో చెప్పలేం. కానీ, రానున్న రోజుల్లో అంటే ఓ పదేళ్ల తర్వాత అయినా (ఆస్కార్‌ను ఉద్దేశించి) ఈ రోజుల విలువేంటో తెలుస్తుంది’’ అని రామ్ చరణ్ చెప్పారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Comedian Raghu: జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్.. ఆయన జోలికేస్తే ప్రాణాలు తీస్తా..

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-12T17:18:24+05:30 IST