Das Ka Dhamki: ట్రైలర్ 2.0 వదిలేది ఎక్కడంటే..

ABN , First Publish Date - 2023-03-10T21:50:35+05:30 IST

వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్ విషయంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి

Das Ka Dhamki: ట్రైలర్ 2.0 వదిలేది ఎక్కడంటే..
Vishwak Sen In Das Ka Dhamki

డైనమిక్ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen) నటిస్తోన్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్ విషయంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి విశ్వక్సేన్ హీరోగా నటించడమే కాకుండా.., దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను కూడా నిర్వహించారు. కూడా. విశ్వక్సేన్ జోడిగా నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ 2.0 (Trailer 2.0)ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. ఈ ట్రైలర్ విడుదలకు సంబంధించిన తేదీతో పాటు వేదికను కూడా ప్రకటించారు.

ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు మంచి స్పందనను రాబట్టుకున్నాయి. అలాగే ‘దాస్ కా ధమ్కీ’ 1.0 ట్రైల‌ర్‌ను నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna) వదిలారు. ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడమే కాకుండా.. మంచి క్రేజ్‌కు కారణమైంది. ఇక విడుదల తేది దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచారు. ‘దాస్ కా ధమ్కీ’ 2.0 ట్రైలర్‌ని మార్చి 12న కరీంనగర్‌లోని మార్క్ఫెడ్ గ్రౌండ్, రామ్ నగర్‌లో జరిగే ఈవెంట్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ క్లాస్, మాస్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. (Das Ka Dhamki Trailer 2 Point O Release Details)

కాగా.. వన్మయే క్రియేషన్స్ (Vanmaye Creations), విశ్వక్సేన్ సినిమాస్ (Vishwaksen Cinemas) బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Nagababu: ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

Updated Date - 2023-03-10T21:50:38+05:30 IST