సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Comedian Raghu: జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్.. ఆయన జోలికేస్తే ప్రాణాలు తీస్తా..

ABN, First Publish Date - 2023-03-12T15:45:47+05:30

తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి రఘు (Raghu). ‘అదుర్స్‌’, ‘లక్ష్మి’, ‘కిక్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వక ముందు ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి రఘు (Raghu). ‘అదుర్స్‌’, ‘లక్ష్మి’, ‘కిక్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వక ముందు ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఈ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తనను ఎంతగానో ప్రోత్సహించారని రఘు చెప్పారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. తారక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జోలికొస్తే చంపడానికైనా, చావడానికైనా సిద్ధం అని చెప్పారు.

‘‘జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. నా బాడీలో ఆయనొక పార్ట్‌. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారు. ఆయనకు ఏ ఒక్కరితో కూడా గ్యాప్ రాలేదు. ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు శక్తి. గొప్ప టాలెంట్ ఉన్న నటుడు. తాతకి తగ్గ మనవడు. ఆయన వస్తేనే టీడీపీ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుంది. భవిష్యత్‌లో కచ్చితంగా ఆయన సీఎం అవుతారు. తారకరత్న మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది’’ అని రఘు తెలిపారు.

‘‘ప్రస్తుతం నా జీవితం చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. రామ్‌ చరణ్, అల్లు అర్జున్‌, ప్రభాస్, వెంకటేశ్‌తో సినిమాలు చేశా. ఇంతవరకు సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి దగ్గర పని చేయలేదు. ఈ ఏడాదైనా అవకాశం వస్తుందేమో చూడాలి. నాకు ఎలాంటి ఆస్తు లేవు. ఉన్నవే పోగొట్టుకున్నా. కానీ, ఇప్పుడు సంపాదించుకున్నా. లైఫ్ అంటే ఔటర్ రింగ్‌ రోడ్డు కాదు. సిటీ రోడ్లు. అక్కడక్కడ స్పీడ్ బ్రేక్స్ ఉంటాయని తెలుసుకున్నా’’ అని రఘు చెప్పారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-12T15:47:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!