Ananya Nagalla: బాబోయ్.. భయపెట్టేస్తోన్న అనన్య.. ఆ కోరిక తీరేనా?

ABN , First Publish Date - 2023-08-04T13:42:19+05:30 IST

‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాలతో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి అనన్య నాగళ్ల. కొన్నాళ్లుగా సోషల్ మీడియాకే పరిమితమైన ఈ భామ.. గ్లామర్ ఫొటోలతో తన పరిధిని విస్తరించే పని పెట్టుకుంటోంది. తాజాగా ఆమె నటిస్తోన్న ‘తంత్ర’ మూవీ‌లోని లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Ananya Nagalla: బాబోయ్.. భయపెట్టేస్తోన్న అనన్య.. ఆ కోరిక తీరేనా?
Ananya Nagalla Look in Tantra

‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాలతో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla). కొన్నాళ్లుగా సోషల్ మీడియాకే పరిమితమైన ఈ భామ.. గ్లామర్ ఫొటోలతో తన పరిధిని విస్తరించే పని పెట్టుకుంటోంది. అయితే ఆ గ్లామర్‌కు సరిపడా అవకాశాలైతే ఆమెకు అంతగా రావడం లేదు కానీ.. ఓ మోస్తరుగా ఆమె రాణిస్తోందనే చెప్పాలి. సోలోగా హిట్ కొట్టేందుకు ఆమె ఎంతగానో ప్రయత్నిస్తుంది కానీ.. అది వర్కవుట్ కావడం లేదు. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘తంత్ర’ (Tantra). హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఈసారి ఆమె కోరిక తీరేలానే ఉంది.


ఈ పోస్టర్‌లో భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ‘మగధీర’లో షేర్‌ఖాన్‌‌ వంటి పాత్రతో పాటు.. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ (Dhanush) ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మరో కీలక పాత్రలో ‘మర్యాదరామన్న’ (Maryada Ramanna) ఫేం సలోని (Saloni) ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తోంది.

Ananya-Nagalla.jpg

భారతీయ తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి (Srinivas Gopisetti) అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ‘ఫిమేల్ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది” అని దర్శకనిర్మాతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*NTR vs Allu Arjun: ‘పుష్పరాజ్’ వర్సెస్ ‘దేవర’.. ఫిక్సయినట్టేనా?

**************************************

*Deviyani Sharma: ఈ ‘సైతాన్’ భామ చూపు మారింది

**************************************

*Aditi Shankar: ఆ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌లో శంకర్ తనయ..

**************************************

*Sushanth: మెగాస్టార్‌తో ‘భోళా శంకర్’ సినిమాలో చేస్తున్నానని.. చినమామయ్యకి చెప్పా..

**************************************

*Skanda: శ్రీలీల చుట్టూ రామ్.. ఇద్దరూ ఇరగేశారు

**************************************

Updated Date - 2023-08-04T13:42:19+05:30 IST