RRR: బాలీవుడ్ చిత్రమన్న హోస్ట్.. తప్పును సరిదిద్దబోయి పప్పులో కాలేసిన హీరోయిన్..

ABN , First Publish Date - 2023-03-29T16:04:03+05:30 IST

మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన నటి ప్రయాంక చోప్రా (Priyanka Chopra). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

RRR: బాలీవుడ్ చిత్రమన్న హోస్ట్.. తప్పును సరిదిద్దబోయి పప్పులో కాలేసిన హీరోయిన్..

మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన నటి ప్రయాంక చోప్రా (Priyanka Chopra). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR)ను బాలీవుడ్ చిత్రమన్నారు. హోస్ట్ తప్పును సరిదిద్దపోయి ప్రియాంక పప్పులో కాలేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ను ప్రియాంక తమిళ్ సినిమాగా అభివర్ణించారు. ఫలితంగా నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

అమెరికన్ ఎక్స్‌ఫర్ట్ అనే పాడ్‌కాస్ట్ ఛానల్‌కు ప్రియాంక ఇంటర్వ్యూ ఇచ్చారు. బాలీవుడ్ గురించి మాట్లాడారు. బాలీవుడ్, హాలీవుడ్ పోలికలపై అభిప్రాయలను పంచుకున్నారు. ‘‘కొంత మంది నటులు, స్టూడియోస్ మాత్రమే బాలీవుడ్ సినిమాలను నిర్మిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రావడంతోనే సత్తా ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తున్నాయి’’ అని ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా హోస్ట్ ‘ఆర్ఆర్ఆర్’ ను బాలీవుడ్ చిత్రమన్నారు. హోస్ట్ తప్పును ప్రియాంక సరిదిద్దడానికి ప్రయత్నించారు. ‘‘ఆర్ఆర్ఆర్ అనేది బిగ్, మెగా, బ్లాక్‌బాస్టర్ తమిళ్ చిత్రం. అవెంజర్స్ మాదిరిగా ఉంటుంది’’ అని ప్రియాంక చెప్పారు. ఆమె ‘ఆర్ఆర్ఆర్’ ను తమిళ్ చిత్రమనడంతోనే నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్‌కు ఆమె హాజరయ్యి కూడా తమిళ్ సినిమా అనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

విప్లవ కారులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్ఫూర్తితో ‘ఆర్ఆర్ఆర్’ ను రూపొందించారు. 1920ల బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలివియో మోరిస్, రే స్టీవెన్సన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-29T16:38:16+05:30 IST