Kamal Haasan: కోలీవుడ్ స్టార్ హీరోతో శింబు సినిమా

ABN , First Publish Date - 2023-03-10T20:32:27+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో శింబు (Simbu) ఒకరు. ‘మానాడు’, ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ కొట్టారు. ప్రస్తుతం వెట్రి మారన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగానే తాజాగా మరో ప్రాజెక్టును పట్టలెక్కించే పనిలో పడ్డారు.

Kamal Haasan: కోలీవుడ్ స్టార్ హీరోతో శింబు సినిమా

కోలీవుడ్ స్టార్ హీరోల్లో శింబు (Simbu) ఒకరు. ‘మానాడు’, ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ కొట్టారు. ప్రస్తుతం వెట్రి మారన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగానే తాజాగా మరో ప్రాజెక్టును పట్టలెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించనున్నారు.

శింబు సినిమా వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌టీఆర్ 48’ (STR48) అని వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఆర్. మహేంద్రన్ నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని దేశింగ్ పెరియసామి తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టు రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్‌కు 56వది. ప్రస్తుతం ఈ సంస్థ వరుసగా సినిమాలను నిర్మిస్తుంది. మణిరత్నం దర్శకత్వంలో ‘కెహెచ్‌234’ (KH234), రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న సాయి పల్లవి చిత్రాలను ఈ ప్రొడక్షన్ హౌసే నిర్మించనుంది.

కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో నటిస్తుండటంతో శింబు తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సినిమా చేయడం సంతోషం. దేశింగ్ పెరియసామి స్క్రిప్ట్‌పై నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ చిత్రం నా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది’’ అని శింబు తెలిపాడు. కొత్త సినిమా ప్రకటన సందర్భంగా చిత్ర బృందానికి కమల్ హాసన్ శుభాకాంక్షలు చెప్పాడు. ఈ చిత్రం శింబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం దాదాపుగా రూ.100కోట్ల బడ్జెట్‌ను వెచ్చించనున్నారని సమాచారం అందుతుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-10T20:32:29+05:30 IST