Sanjay Dutt: సెట్లో అడుగు పెట్టిన ‘అధీరా’!

ABN , First Publish Date - 2023-03-11T17:49:14+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో సంజయ్ దత్ (Sanjay Dutt) ఒకరు. ‘కెజియఫ్-2’ (KGF 2)తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికి చేరువయ్యారు. ఈ చిత్రంలో ‘అధీరా’ పాత్రలో కనిపించి విలనిజంను పండించారు.

Sanjay Dutt: సెట్లో అడుగు పెట్టిన ‘అధీరా’!

బాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో సంజయ్ దత్ (Sanjay Dutt) ఒకరు. ‘కెజియఫ్-2’ (KGF 2)తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికి చేరువయ్యారు. ఈ చిత్రంలో ‘అధీరా’ పాత్రలో కనిపించి విలనిజంను పండించారు. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో వరుసగా దక్షిణాది ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపుతున్నారు. కోలీవుడ్ సినిమా ‘లియో’ (Leo) లో పవర్ ఫుల్ విలన్ రోల్‌ను పోషిస్తున్నారు. ఈ మూవీ సెట్స్‌లోకి తాజాగా ఆయన అడుగుపెట్టారు. అందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

leo.jpg

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దలపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటిస్తున్న సినిమా ‘లియో’. లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష కృష్ణన్ హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. సంజయ్ దత్ తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. మేకర్స్ అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో.. సంజయ్ దత్ చిత్ర బృందంతో సరదాగా ముచ్చటిస్తున్నారు. విజయ్, లోకేశ్‌తో కలసి నవ్వులు చిందిస్తున్నారు.

‘లియో’ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో రూపొందుతోంది. ప్రియా ఆనంద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్జున్, మిస్కిన్, గౌతమ్ మీనన్, సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు విలన్ పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రూపొందిస్తుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-11T17:50:31+05:30 IST