సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ponniyin Selvan 2: ఆడియో, ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ABN, First Publish Date - 2023-03-27T20:51:02+05:30

స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). పాన్ ఇండియాగా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Ponniyin Selvan 2
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). పాన్ ఇండియాగా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘పీఎస్- 1’ ను సెప్టెంబర్ 30న విడుదల చేయగా సంచలన విజయం సాధించింది. అందువల్ల రెండో భాగంపై భారీ అంచనాలున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan 2) ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆడియో, ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఆడియో, ట్రైలర్‌ను మార్చి 29న లాంచ్ చేయనున్నారు. ఈ వేడుక నెహ్రు స్టేడియంలో జరగనుంది. ఆడియో, ట్రైలర్‌ను విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఆవిష్కరించనున్నారు. చిత్ర బృందంతో సహా పలువురు నటులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ చిత్రానికి ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా తోట తరణి వ్యహరిస్తున్నారు. ఈ చిత్రంలో రాజరాజ చోళునిగా జయం రవి, ఆదిత్య కరికాలన్ (Aditya Karikalan)గా విక్రమ్, నందిని‌గా ఐశ్వర్య రాయ్, వంథియ దేవన్‌ (Vanthiyathevan)గా కార్తి, కుందవై (Kundavai)గా త్రిష నటించారు. జయరాం (Jayaram), ప్రకాష్ రాజ్ (Prakash Raj), ప్రభు (Prabhu), శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-27T20:51:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!