PS-2 Trailer out: రెండో భాగమైన ఇతర భాషల్లో ఆకట్టుకుంటుందా?.. ట్రైలర్ ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2023-03-30T12:27:36+05:30 IST

మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) అనే విషయం తెలిసిందే.

PS-2 Trailer out: రెండో భాగమైన ఇతర భాషల్లో ఆకట్టుకుంటుందా?.. ట్రైలర్ ఎలా ఉందంటే..
Ponniyin Selvan II trailer out

మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) అనే విషయం తెలిసిందే. ఈ దర్శకుడే ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాలని ఈ దర్శకుడు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు అనుకున్నది ఇటీవలే సాధించారు. దాదాపు ఐదు భాగాలు ఉన్న ఆ పుస్తకాన్ని సినిమాకి తగ్గట్లు రెండు భాగాలుగా మార్చారు. అందులో మొదటిభాగాన్ని గతేడాది సెప్టెంబర్ 30న విడుదల చేశారు. లైక ప్రోడక్సన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీలో.. తమిళ స్టార్ హీరోలు విక్రమ్ (Vikram), జయం రవి, కార్తీ (Karthi), అందాల తారలు ఐశ్వర్యా రాయ్, త్రిష (Trisha), ఐశ్వర్యా లక్ష్మి, శోభితా దూళిపాళ కీలక పాత్రల్లో నటించారు.

పాన్ ఇండియా స్థాయిలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై సంచనాలు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్ల పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే.. అందులో ఎక్కువ భాగంగా తమిళ ప్రేక్షకుల అందించారు. మిగిలిన నాలుగు భాషల ప్రేక్షకులు అంతగా థియేటర్స్‌కి వెళ్లలేదు. తమిళ ప్లేవర్ ఎక్కువగా ఉండడంతో ఇతర భాషల్లో సినీ ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదని అప్పట్లో టాక్ నడిచింది. అయితే.. ఓటీటీలో విడుదలైన తర్వాత మాత్రం అన్ని భాషల్లోనూ మంచి వ్యూస్‌నే సాధించింది. దాంతో.. రెండో పార్టుపై అంచనాలు కొంచెం పెరిగాయనే చెప్పాలి. అలాగే.. ‘పీఎస్ 2’ని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అప్పట్లోనే ప్రకటించారు. (Ponniyin Selvan II trailer out now)

ఈ తరుణంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మార్చి 29న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సినీ ప్రముఖుల మధ్య ఆడియో లాంచ్ నిర్వహించి.. అనంతరం ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అది చూస్తుంటే.. ఈ రెండో పార్టులో ఇతర భాష ప్రేక్షకులని ఆకట్టుకునే అంశాలు బాగానే ఉన్నాయనిపిస్తోంది. ముఖ్యంగా.. ఈ రెండో భాగంలో ఐశ్వర్యా రాయ్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనుండడంతో అంచనాలు పెరిగాయి. (Ponniyin Selvan II trailer out)

అయితే.. ఆడియో లాంచ్ ఈవెంట్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. డైరెక్టర్ మణిరత్నాన్ని ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) గురువులా భావిస్తుందనే విషయం తెలిసిందే. ఆయన తీసిన పలు సూపర్ హిట్ సినిమాల్లో ఈ బ్యూటీనే హీరోయిన్‌గా నటించింది. దీంతో.. ఈ ఈవెంట్‌లో ఓ సందర్భంలో ఐశ్వర్య వెళ్లి కాళ్లకి మొక్కింది. దీంతో వెంటనే రియాక్టయిన మణిరత్నం ఆమెని కౌగిలించుకున్నాడు. అనంతరం సుహాసిని మణిరత్నాన్ని సైతం ఐశ్వర్య కౌగిలించుకుంది. (Aishwarya Rai Bachchan touches Mani Ratnam's feet)

ఇవి కూడా చదవండి:

Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Updated Date - 2023-03-30T12:27:38+05:30 IST