సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

A.R. Murugadoss: ‘1947 ఆగస్టు 16’న ఆ ఊర్లో ఏం జరిగింది?

ABN, First Publish Date - 2023-03-17T14:31:53+05:30

మహాత్మా గాంధీ వంటి ఎంతోమంది యోధుల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహాత్మా గాంధీ వంటి ఎంతోమంది యోధుల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయితే.. ఆ రోజుకు ముందు, తర్వాతి రోజుల్లో ఒక కొండ ప్రాంతంలోని గ్రామంలో ఏం జరిగిందన్న అంశాన్ని తీసుకుని, ఒక కల్పిత కథాంశంతో తెరకెక్కించిన చిత్రం ‘1947 ఆగస్టు 16’ (1947 August 16). ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకానుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ (A.R. Murugadoss) సమర్పణలో ఏఆర్‌ మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌, పర్పుల్‌బుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌, గాడ్‌బ్లెస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై నిర్మితమైంది. ఏఆర్‌ మురుగదాస్‌ శిష్యుడు ఎన్‌.ఎస్.పొన్‌కుమార్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గౌతం కార్తీక్‌, రేవతి, పొన్‌కుమార్‌ తదితరులు నటించగా.. శ్యాన్‌ రోల్డన్‌ సంగీతం. ప్రమోషన్‌లో భాగంగా చిత్ర నిర్మాతలు మురుగదాస్‌, ఓం ప్రకాష్‌ భట్‌, హీరో గౌతం కార్తీక్‌, దర్శకుడు ఎన్‌.ఎ్‌స.పుగళ్‌, హాస్య నటుడు పుగళ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. (1947 August 16)

పొన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం వచ్చిందనే విషయమే తెలియని ఒక గ్రామం, అక్కడ నివశించే ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు ఉండేవి? ఆ గ్రామస్తులను బ్రిటీషర్లు ఏ విధంగా వేధించారు? భయపెట్టారు? ప్రేమే జీవితంగా భావించే ఒక యువకుడు.. గ్రామ ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేశారు? వంటి అంశాలను కల్పిత కథాంశాలతో తెరకెక్కించాం. పుగళ్‌ను ఇప్పటివరకు ఒక హాస్య నటుడుగానే ప్రేక్షకులు చూశారు. ఇందులో అతనిలోని మరో కోణాన్ని చూస్తారు. స్ర్కిప్టు తయారీలో దర్శకుడు మురుగదాస్‌ ఎంతగానో సాయం చేశారు. ఆయన వల్లే ఈ ప్రాజెక్టు ఇలా వచ్చింది. 1947 నాటి పరిస్థితులు ప్రతిబింబించేలా చిత్రీకరించాం. శ్యాన్‌ రోల్డన్‌ సంగీతం సినిమాకు ప్రాణం’ అని వివరించారు.

హీరో గౌతం కార్తీక్‌ మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన చిత్రం. ఈ తరహా పాత్ర కోసం ఇతరులను ఆదర్శంగా తీసుకోలేదు. దర్శకుడు చెప్పినట్టుగా నటించాను’ అని అన్నారు. నిర్మాత ఏఆర్‌.మురుగదాస్‌ మాట్లాడుతూ.. ‘ఒక మంచి కథతో సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. ఈ కథ అనేక కంపెనీలకి నచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో కథను చదవగా నాకు నచ్చడంతో సెట్స్‌పైకి తీసుకెళ్లాం’ అని వివరించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 7న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి:

RRR Controversy: ‘నాటు నాటు’కి భాస్కర్ అవార్డు కూడా రాదు.. సింగర్‌పై ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యాన్స్‌ ఫైర్..

Rana: ఎన్టీఆర్ నుంచి అది దొంగతనం చేయాలి.. అనుకుంటే 20 నిమిషాల్లోనే..

Kabzaa Twitter Review: కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’?.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Updated Date - 2023-03-17T14:31:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!