సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kushboo: ఆ ఇద్దరి ప్రేమకు నేను బానిసను!

ABN, First Publish Date - 2023-04-14T14:48:06+05:30

ఖుష్బూ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటి (Actress)గానూ, రాజకీయ నాయకురాలి (Political Leader)గానూ కొనసాగుతున్నారు. తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలను ఆమె ఎన్నుకుంటూ..

Kushboo Tweet on Chinna Thambi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ డైరెక్టర్‌ పి.వాసు (P Vasu) దర్శకత్వంలో ప్రభు - ఖుష్బూ (Prabhu and Kushboo) జంటగా నటించిన చిత్రం ‘చిన్నతంబి’ (Chinna Thambi). ఈ మూవీ విడుదలై 32 యేళ్ళు గడిచిపోయాయి. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నటి ఖుష్బూ తన ట్విటర్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారు. ‘తమిళ సినీ చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన ‘చిన్నతంబి’ చిత్రం విడుదలై అపుడే 32 యేళ్ళు గడిచిపోయాయి అంటే నమ్మలేకపోతున్నాను. పి.వాసు, ప్రభు నాపై చూపించిన ప్రేమకు నేను ఎల్లవేళలా బానిసను. నా గుండె ఎప్పుడూ వాసు సర్‌, ప్రభు సర్‌ అని కొట్టుకుంటుంది. తన్మయత్వంలో ముంచెత్తే ఇళయరాజా సంగీతానికి నేను ఎల్లవేళలా రుణపడివుంటాను. ప్రేక్షకుల హృదయాల్లో నందిని ఎప్పటికీ నిలిచివుంటుంది. మరోమారు ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. (Kushboo about Chinna Thambi)

కాగా, గత 1991లో వచ్చిన ‘చిన్నతంబి’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కథ, కథనం, దర్శకత్వం, సంగీతం వేటికవే ప్రత్యేకం అనేలా ఉండటంతో.. అప్పట్లో ఈ చిత్రం మెగా హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలు వినిపిస్తూనే ఉంటాయంటే.. ఇళయరాజా (Ilaiyaraaja) గొప్పతనమది. ఈ చిత్రం 32 సంవత్సరాలు (32 Years to Chinna Thambi) పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆ చిత్రంలో రాధారవి, మనోరమ, రాజేష్‌ కుమార్‌, గౌండమణి వంటివారు ఇతర పాత్రలలో నటించారు.

ఇక ఖుష్బూ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటి (Actress)గానూ, రాజకీయ నాయకురాలి (Political Leader)గానూ కొనసాగుతున్నారు. తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలను ఆమె ఎన్నుకుంటూ.. ప్రేక్షకులని అలరిస్తున్నారు. అలాగే ప్రజల తరపున తన గళం విప్పేందుకు పొలిటికల్‌గానూ ఆమె యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీ (BJP)లో ఉన్నారు. ఇటీవల ఆమె జాతీయ మహిళ కమిషన్ (NCW) మెంబర్​గా ఎన్నికయ్యారు. ఇంత పెద్ద బాధ్యతను తనకు అప్పగించిన ప్రధాని మోడీ (Prime Minister Modi)కి, కేంద్రానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది

*Vijay Deverakonda: ‘శాకుంతలం’ విడుదల వేళ.. సమంతకు విజయ్ బూస్ట్

*KGF Actress: ‘కెజియఫ్‌’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది

*Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?

*Brahmaji: ట్రైలర్ బాగుందా? అని అడిగిన సంయుక్తకు షాకింగ్ రిప్లయ్

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

Updated Date - 2023-04-14T14:48:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!