Sridevi Shobhan Babu: ‘శ్రీదేవి శోభన్ బాబు’ ఓటీటీలోకి వచ్చేస్తున్నారహో..

ABN , First Publish Date - 2023-03-16T16:44:11+05:30 IST

యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santhosh Shoban) హీరోగా.. తమిళ్‌లో ‘96’, తెలుగులో ‘జాను’ చిత్రాల్లో చిన్నప్పటి జాను పాత్ర పోషించిన గౌరి కిషన్ (Gouri Kishan) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’ (Sridevi Shobhan Babu). రోహిణి, నాగబాబు కీలక పాత్రల్లో

Sridevi Shobhan Babu: ‘శ్రీదేవి శోభన్ బాబు’ ఓటీటీలోకి వచ్చేస్తున్నారహో..
Sridevi Shobhan Babu Movie Still

యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santhosh Shoban) హీరోగా.. తమిళ్‌లో ‘96’, తెలుగులో ‘జాను’ చిత్రాల్లో చిన్నప్పటి జాను పాత్ర పోషించిన గౌరి కిషన్ (Gouri Kishan) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’ (Sridevi Shobhan Babu). రోహిణి, నాగబాబు కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల (Prashanth Dimmala) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత (Megastar Chiranjeevi's daughter Sushmitha Konidela) నిర్మించారు. రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. వెండితెరపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుని.. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 30 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+Hotstar) ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీదేవి (గౌరి) హైదరాబాద్‌లో ఒక ఫ్యాషన్ డిజైనర్. స్నేహితులతో కలిసి అరకు వెళతానని అడిగిన శ్రీదేవిని తండ్రి నాగబాబు (Nagababu) వద్దు అని వారిస్తాడు. ఎందుకు అని అడిగితే, తండ్రి తన పాత జ్ఞాపకాలు చెప్తాడు. ఆ పాత జ్ఞాపకాలు తెలుసుకున్న శ్రీదేవి.. తన తండ్రికి అన్యాయం చేసిన శోభన్ బాబు కుటుంబంపై ఎలా రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేసింది? ఈ క్రమంలో బావ మరదళ్లు అయిన శ్రీదేవి, శోభన్ ఎలా ఒక్కటయ్యారు? అనేదే ఈ సినిమా కథ. మన పక్కన ఇంట్లోనో లేదంటే మనకు తెలిసిన వాళ్ల ఇంట్లోనే ఈ కథ విన్నట్లో, జరిగినట్లో ఉంటుంది. (Sridevi Shobhan Babu Story)

ఈ సినిమా ఓటిటిలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను (Family Audience) మరింతగా ఎంటర్‌టైన్ చేస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఇలాంటి సినిమాలకు థియేటర్స్‌లో కంటే ఓటిటి లోనే మంచి స్పందన ఉంటుందని ఇప్పటికే విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఆ కోవలోనే ఈ ‘శ్రీదేవి శోభన్ బాబు’ (Sridevi Shobhan Babu Movie) కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 30 నుంచి ప్రేక్షకులను అలరిస్తారని మేకర్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

*Roshan Kanakala: హీరోగా యాంకర్ సుమక్క కొడుకు.. లుక్ అదిరింది

*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..

*PVT04: మెగా హీరోని ఢీ కొట్టబోతోంది ఎవరో తెలుసా?

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-16T16:50:53+05:30 IST