PVT04: మెగా హీరోని ఢీ కొట్టబోతోంది ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2023-03-15T17:10:16+05:30 IST

తొలి చిత్రంతోనే ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) సంయుక్త నిర్మాణంలో

PVT04: మెగా హీరోని ఢీ కొట్టబోతోంది ఎవరో తెలుసా?
Joju George Look in PVT04

తొలి చిత్రంతోనే ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న PVT04 చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో నాలుగో సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్.ఎన్.రెడ్డి (Srikanth N Reddy) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎస్. నాగవంశీ (Naga Vamsi S), సాయి సౌజన్య (Sai Soujanya) నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ (Joju George).. ‘చెంగా రెడ్డి’ (Chenga Reddy) అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఆయన లుక్‌ని విడుదల చేశారు.

‘ఇరాట్ట, జోసెఫ్, నయత్తు, తురముఖం, మధురం’ వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన జోజు జార్జ్ పలు పురస్కారాలను సైతం అందుకున్నారు. ఇప్పుడాయన సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయనకు సంబంధించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో.. ఒక చేత్తో పదునైన ఆయుధాన్ని పట్టుకొని, మరో చేత్తో లైటర్‌తో నోట్లోని సిగరెట్‌ను వెలిగిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని పలికిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో.. జోజు జార్జ్ పాత్ర తాలూకు పోస్టర్ పవర్ ఫుల్‌గానే కాదు.. ఆకట్టుకునేలా ఉంది. అలాగే జోజు జార్జ్ నటించిన ‘ఇరాట్ట’ (Iratta) సినిమా ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందటంతో చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. (Joju George Look in PVT04 Out)

Joju-George-2.jpg

వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) ఈ చిత్రంలో సరికొత్త మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇదని అంటున్నారు చిత్ర దర్శక,నిర్మాతలు. భారీస్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్ర టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Dasara Trailer: ఇదీ ట్రైలర్‌ అంటే.. ఒక్కొక్కనికి రాల్తాయ్!!

*Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?

*Oscar to RRR: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందనిదే..

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

Updated Date - 2023-03-15T17:35:27+05:30 IST