Niharika Konidela: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్

ABN , First Publish Date - 2023-05-17T14:40:29+05:30 IST

నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ వెబ్ సిరీస్ (Web Series) చేస్తున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నన్ను నేను కూడా గాయత్రి పాత్రలో ఊహించుకోలేను. కానీ మా..

Niharika Konidela: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్
Niharika Konidela

నన్ను నేను కూడా ఊహించుకోలేని పాత్రని.. నాతో దర్శకుడు ఆదిత్య చేయించారని అన్నారు నిహారిక కొణిదెల (Niharika Konidela). ఆమెతో పాటు వైవా హర్ష, అక్షయ్, సాయి రోనక్‌, భావనలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’ (Dead Pixels). అక్షయ్ పూల్ల అందించిన కథతో ఆదిత్య మందల (Director Aditya Mandala) ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. బీబీసీ స్టూడియోస్ ఇండియన్ ప్రై.లి., తమడా మీడియా ప్రై.లి బ్యానర్ల మీద సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడా సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ (Disney+ Hotstar)లో ఈ వెబ్ సిరీస్ మే 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుక (Pre Release Event)ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిహారిక మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ వెబ్ సిరీస్ (Web Series) చేస్తున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నన్ను నేను కూడా గాయత్రి పాత్రలో ఊహించుకోలేను. కానీ మా దర్శకుడు ఆదిత్య నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చారు. ఈ పాత్రను చేయగలననే నమ్మకం ఇచ్చినందుకు థాంక్స్. అక్షయ్‌కి సినిమాలు అంటే బాగా ఇష్టం. మా ఇద్దరి మధ్యే ఎక్కువ సీన్లు ఉంటాయి. హర్ష నాకు ఎప్పటి నుంచో తెలుసు. రోషణ్ పాత్రే చాలా కష్టమని కథ విన్నప్పుడు మాకు అనిపించింది. ఆ పాత్రను రోనక్ అద్భుతంగా పోషించారు. భావనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నన్ను ఇంత అద్భుతంగా చూపించినందుకు ఫహద్ గారికి థాంక్స్. ఏ వయసు వాళ్లైనా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. కానీ యంగ్ జనరేషన్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు థాంక్స్. ఇంకా నటిగా, నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. తమడా మీడియాకు థాంక్స్. ఈ వెబ్ సిరీస్‌కు పని చేయడం నాకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

Dead-Pixels.jpg

దర్శకుడు ఆదిత్య (Director Aditya) మాట్లాడుతూ.. ‘‘ఇది యువతకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్‌. ఒక్కో పాత్రకు ఒక్కో కారెక్టరైజేషన్ ఉంటుంది. జీవితంలోని ఒక్కో దశకు ఒక్కో పాత్ర ప్రతీకగా ఉంటుంది. ఈ షోను ఇంతలా తీసేందుకు సహకరించిన తమడా మీడియాకు థాంంక్స్. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీం అందరూ కష్టపడటం వల్లే ఇంత బాగా వచ్చింది. ఫహద్ వల్లే నేను సెట్‌లో ఎంతో సరదాగా ఉండగలిగాను. నిహారిక చేసిన పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. అక్షయ్‌ను నేను పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. హర్ష లేకుండా నేను ఏ ప్రాజెక్ట్ చేయలేను. రోనక్‌ ప్రతీ సీన్‌లో అద్భుతంగా నటించారు. భావన అయితే ఐశ్వర్యలానే నటించింది. హాట్ స్టార్ మార్కెటింగ్ టీంకు స్పెషల్ థాంక్స్’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*PKSDT: టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

*Kavya Thapar: మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చా

*Major: ‘మేజర్’ హీరో అడివి శేష్‌‌ను.. మాజీ రాష్ట్రపతి ఇంటికి పిలిచి మరీ..!

* Sharwanand: మే ఎండింగ్‌లో.. జైపూర్‌లో పెళ్లి అనుకున్నారు కానీ..?

*Vijay Antony: చాలా రోజులు అరటిపళ్ళు తిని బతికా..

*Nikhil: అమిత్ షా నుంచి నాకూ ఆహ్వానం వచ్చింది.. కానీ?

Updated Date - 2023-05-17T14:40:29+05:30 IST